దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. నిన్న తొలిసారిగా సెన్సెక్స్ 79వేల మార్క్, నిఫ్టీ 24వేల మార్క్ దాటగా ఈరోజు ఆ జోరును కొనసాగిస్తున్నాయి. 278 పాయింట్ల లాభంతో 79,519 వద్ద దూసుకెళ్తున్న సెన్సెక్స్ ఓ దశలో గరిష్ఠంగా 79,671కు చేరింది. నిఫ్టీ 100కుపైగా పాయింట్లు ఎగిసి 24,145 వద్ద ట్రేడవుతోంది. డాక్టర్ రెడ్డిస్, SBI, ONGC, టాటా మోటార్స్ నిఫ్టీ టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
సెన్సెక్స్ 30 సూచీలో ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, కొటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.