November Car Offers : కారు కొనడానికి ఇదే బెస్ట్ టైం..ఏకంగా రూ.2 లక్షలు మిగుల్చుకోవచ్చు.
November Car Offers :కొత్త కారు కొనాలని ఎదురుచూసేవారికి ఇది నిజంగా పండుగే. నవంబర్ నెలలో ప్రముఖ కార్ల కంపెనీ మారుతి సుజుకి తమ వాహనాలపై భారీ తగ్గింపులను ప్రకటించింది. మీరు మారుతి నెక్సా లేదా అరీనా డీలర్‌షిప్ నుంచి కారు కొనుగోలు చేస్తే ఏకంగా రూ.2.18 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ప్రయోజనం మీకు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, స్క్రాప్ బోనస్ రూపంలో లభిస్తుంది. నవంబర్ 30 వరకు మాత్రమే ఉండే ఈ బంపర్ డిస్కౌంట్‌లు ఏయే కార్లపై, ఎంత వరకు ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
డిస్కౌంట్లలో టాప్ 5 మారుతి కార్లు
నవంబర్ నెలలో మారుతి సుజుకి అత్యధిక తగ్గింపులు పొందుతున్న 5 కార్లు ఇక్కడ ఉన్నాయి:
మారుతి ఇన్విక్టో : ఈ కారుపై అత్యధికంగా రూ.2.18 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. Alpha+ వేరియంట్ మీద రూ.2,18,000 వరకు తగ్గింపు. Zeta+ వేరియంట్ పై రూ.1,93,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
మారుతి గ్రాండ్ విటారా : ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీపై దాని వేరియంట్‌ను బట్టి రూ.1.73 లక్షల వరకు తగ్గింపు ఉంది. సిగ్మా వేరియంట్ మీద రూ.1,21,500 వరకు, డెల్టా, జెటా/జెటా(O), ఆల్ గ్రిప్, ఆల్ఫా/ఆల్ఫా(O) వేరియంట్స్ పై 1,23,000 వరకు..స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్స్ మీద అత్యధికంగా రూ.1,73,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
మారుతి జిమ్నీ: ఈ లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీపై కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఆల్ఫా వేరియంట్ మీద రూ.83,000 వరకు తగ్గింపు వస్తుంది. జెటా వేరియంట్ పై 8,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
మారుతి బలెనో : బాగా అమ్ముడయ్యే ఈ హ్యాచ్‌బ్యాక్ పై కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఎంటీ, సీఎన్‌జీ వేరియంట్ల మీద మొత్తం రూ.38,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఏఎంటీ వేరియంట్ మీద రూ.43,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
మారుతి ఎక్స్ఎల్6 : ఈ ప్రీమియం ఎస్‌యూవీపై మొత్తం రూ.43,000 వరకు తగ్గింపును అందిస్తున్నారు. ఈ తగ్గింపులో కన్స్యూమర్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్, కార్పొరేట్ ఆఫర్, aCRM ఆఫర్ వంటివి కలిసి ఉన్నాయి.
ఈ డిస్కౌంట్‌లన్నీ నవంబర్ 30, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్‌లు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్ వంటి వివిధ రూపాల్లో లభిస్తాయి. మీరు కొత్త కారు కొనాలనుకుంటే.. ఈ బంపర్ డిస్కౌంట్లను సద్వినియోగం చేసుకోవచ్చు. మరింత ఖచ్చితమైన వివరాల కోసం మీరు వెంటనే మారుతి సుజుకి నెక్సా లేదా అరీనా డీలర్‌షిప్‌ను సంప్రదించడం మంచిది.