Chicken : ఇప్పుడు చికెన్ తినాలంటే ఒక్కసారి పర్సు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు కిలో చికెన్ ధర రూ.300 దాటింది మరి.. డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడంతో కిలో చికెన్ రూ. 300కు చేరుకుంది. వారం కిందట లైవ్ బర్డ్ రేట్ కిలోకుగరిష్ఠంగా రూ.118 ఉంటే, ఆదివారం రూ.141కి చేరింది. దీంతో వ్యాపారులు చికెన్ రేట్లు పెంచేశారు.
ఇది ఇలాగే కంటిన్యూ అయితే వచ్చే ఆదివారం నాటికి కిలో చికెన్ ధరలు రూ.330 నుంచి రూ.350 వరకు చేరవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.300పైనే ఉంది. బోన్ లెస్ చికెన్ రికార్డు స్థాయిలో కిలోకు రూ.500కు పైగా అమ్ముతున్నారు. ఓవైపు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, మరోవైపు ఎండతీవ్రత ఎక్కువైతే చికెన్ ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
సాధారణంగా ప్రతి ఆదివారం గ్రేటర్ లో సుమారు 12 లక్షల కిలోలు, మిగిలిన రోజుల్లో సుమారు 7 లక్షల వరకు చికెన్ విక్రయాలు జరుగుతుంటాయి. తాజాగా ధరల పెరుగుదలతో విక్రయాలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. ఆదివారం వచ్చిందంటే చికెన్ మస్తు అమ్ముడుపోయేదని.. కానీ ఇప్పుడు..రేట్ పెరగడంతో గిరాకీ బాగా తగ్గిందని షాపు యజమానులు అంటున్నారు... కిలో తీసుకుపోయేటోళ్లు అర కిలో తీసుకుంటున్నారని చెబుతున్నారు.
బోన్‌లెస్ చికెన్ 1 కేజీ రూ. 520.00
చికెన్ 1 కేజీ రూ. 319.00
చికెన్ లివర్ 1 కేజీ రూ. 260.00
దేశ చికెన్ 1 కేజీ రూ. 550.00
లైవ్ చికెన్ 1 కేజీ రూ. 180.00
స్కిన్‌లెస్ చికెన్ 1 కేజీ రూ. 390.00