Gas Cylinder Prices : తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

Update: 2024-06-01 04:41 GMT

చమురు సంస్థలు ఇవాళ్టి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.72 మేర తగ్గించాయి. దీంతో హైదరాబాద్‌లో 19 కేజీల సిలిండర్ ధర రూ.1,903కు చేరింది. కాగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు యథాతథంగా ఉండనున్నాయి.

తాజా తగ్గింపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ రిటైల్ ధర రూ.1,676కు తగ్గింది. ఢిల్లీలో రూ.1,676, కోల్‌కతాలో రూ. 1,787, ముంబైలో రూ.1,629, చెన్నైలో రూ. 1,840లకు తగ్గాయి. మే 1న కూడా రూ.19 మేర, అంతకుముందు ఏప్రిల్‌లో రూ.30.50 మేర తగ్గింది

ఈ గ్యాస్ ధరలను ఆయిల్ కంపెనీలు సవరించలేదు. ఇదిలావుంచితే.. కమర్షియల్, డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల రేట్లను ప్రతి నెల మొదటి రోజున ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తుంటాయి. అందులో భాగంగా తాజా ధరల సవరణ చేపట్టాయి

Tags:    

Similar News