Real Estate: ఆ ఏరియాల్లో డిమాండ్.. అందుబాటు ధరలో అపార్ట్‌మెంట్లు

Real Estate: సాధారణంగా ప్రతి ఏటా హైదరాబాదులో 30 నుంచి 40 వేల గృహాలు అమ్ముడవుతుంటాయి.

Update: 2022-06-25 10:45 GMT

Real Estate: మెట్రో విస్తరించడంతో నగరంలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. నగర శివార్లలో ఉన్నా రవాణా సౌకర్యం అందుబాటులో ఉండడంతో అవుట్ స్కట్స్ లో అయినా ఇల్లు కొనేందుకు వెనుకాడ్డం లేదు పౌరులు. ఇప్పుడు అన్ని ఏరియాల్లోకి వాణిజ్య సంస్థలు విస్తరించాయి. మాల్స్, మల్టీప్లెక్సులు ఇబ్బడి ముబ్డడిగా వస్తున్నాయి.

అర్బన్ డెవలప్‌మెంట్ మీద ప్రభుత్వం దృష్టిసారించడంతో నగరంతో కనెక్టివిటీ పెరిగింది. సిటీలో పెద్ద ఎత్తున ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రయాణం భారం తగ్గింది. ఈ కారణం చేతనే శివారు ప్రాంతాల్లో సైతం గృహాలు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఆఫీసుల బాట పట్టే ఉద్యోగులు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు. సాధారణంగా ప్రతి ఏటా హైదరాబాదులో 30 నుంచి 40 వేల గృహాలు అమ్ముడవుతుంటాయి.

అయితే ఈ ఏడాది అదనంగా 1.5 నుంచి 2 లక్షల వరకు కొత్త గృహాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్లాట్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని రియల్ వర్గాలు తెలిపాయి. పెద్ద పైజు యూనిట్లకు డిమాండ్ పెరిగింది.

పశ్చిమ హైదరాబాద్, షాద్ నగర్, శంకర్ పల్లి, చేవెళ్ల, ఆదిభట్ల, నాగార్జున్ సాగర్ రోడ్డ, శ్రీశైలం జాతీయ రహదారి మార్గంలో డిమాండ్ కొనసాగుతుందని వివరించారు. బిల్డర్ ప్రొఫైల్ పరిశీలించకుండా తక్కువ ధరకు వస్తుంది కదా అని తొందరపడి ఇల్లు కొనుగోలు చేయవద్దు.

Tags:    

Similar News