ఆగస్ట్ 1 నుండి, మధ్య తరగతి ప్రజల పర్సులపై ప్రభావం చూపే విధంగా కొన్ని కొత్త వస్తున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలలో సర్దుబాట్లు, బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం కొత్త రూల్స్ రానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం గతంలో రెండు సార్లు గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించింది. అప్పటి నుంచి అది ఫిక్స్ గానే ఉంటుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర విషయానికి వస్తే మాత్రం గత నెలలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించింది. అయితే ఈసారి కూడా అంటే ఆగస్ట్ 1 వ తేదీ నుంచి సిలిండర్ రేటును తగ్గించే అవకాశం ఉందని సమాచారం తెలుస్తుంది. క్రెడ్, చెక్, మొబిక్విక్, ఫ్రీచార్జ్, ఇతర సర్వీసులని వాడి చేసే రెంటల్ చెల్లింపుల లావాదేవీల మొత్తం మీద 1 శాతం ఛార్జ్ అనేది ఉంటుందని సమాచారం తెలుస్తుంది.
ఇది మాక్సిమం రూ.3000 ఉండనుంది. రూ.15,000 లోపు ఫ్యూయల్ లావాదేవీలపై మాత్రం ఎలాంటి అదనపు ఛార్జీ ఉండదు. అయితే రూ.15,000 కంటే ఎక్కువ లావాదేవీలపై మాత్రం 1 శాతం ఉండనుందని తెలుస్తుంది. అది గరిష్టంగా రూ.3000 దాకా ఉండనుంది. రూ.50,000 లోపు యుటిలిటీ లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలనేవి ఉండవు. రూ.50,000 పైబడిన లావాదేవీలపై మాత్రం 1 శాతం లేదా గరిష్టంగా రూ.3000 ఛార్జీ పడుతుందని సమాచారం తెలుస్తుంది. అయితే బీమా లావాదేవీలకు ఈ ఛార్జీ నుంచి తగ్గింపు ఇచ్చారు. కాలేజీ, స్కూల్ వెబ్సైట్లు లేదా వారి పీఓఎస్ మెషీన్ ల ద్వారా నేరుగా చేసే చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలనేవి పడవని తెలుస్తుంది. క్రెడ్, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా చేస్తే ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.3000 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని సమాచారం అందుతుంది. లేట్ పేమెంట్స్ ఛార్జీల్లో కూడా ఆర్బీఐ అనేక సవరణలు చేసింది. ఏదైనా ఆన్లైన్, ఆఫ్ లైన్ స్టోర్ లో ఈజీ- ఈఎంఐ ఆప్షన్ ను కనుక మీరు ఎంచుకుంటే ఈఎంఐ ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉంటుందని సమాచారం.