గ్యాస్ కంపెనీలు సామాన్యుడికి పండుగల ముందు షాకిచ్చాయి. అక్టోబరు నెలలో పండుగలు వరుసగా వస్తుంటాయి. ఈ సందర్భంలో గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు భారీగా పెంచాయి. పెరిగిన గ్యాస్ ధరలు ఈ నెల ఒకటో తేదీ(నేటి నుంచి) అమల్లోకి రానున్నాయి. 19 కిలోల గ్యాస్ సిలిండర్‌లకు రూ. 48.50వరకు పెరిగింది. కొత్త ధరలు దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి.దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1740కి చేరగా... గత నెల సెప్టెంబర్‌లో దీని ధర రూ.1691.50గా ఉంది.హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1919 ఉంది. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ రేటులో ఎటువంటి పెరుగుదల లేదు.