girls schemes: అమ్మాయి ఆర్థిక భద్రతకు ఈ స్కీమ్స్ బెస్ట్

ఆడపిల్లల ఆర్థిక భవిష్యత్తు కోసం పెట్టుబడులు... సరైన సమయంలో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు;

Update: 2025-07-13 06:30 GMT

తల్లి­దం­డ్రు­లు పసి­బి­డ్డ ఆరో­గ్యా­న్ని ఎంత జా­గ్ర­త్త­గా కా­పా­డు­కుం­టా­రో, పి­ల్లల ఆర్థిక భవి­ష్య­త్తు కోసం అంతే జా­గ్ర­త్త­గా ప్లా­న్ చే­సు­కో­వా­లి. ము­ఖ్యం­గా పె­రు­గు­తు­న్న వి­ద్యా ఖర్చు­లు, వి­వా­హం వంటి భవి­ష్య­త్తు అవ­స­రాల కోసం తగిన జా­గ్ర­త్త­లు తీ­సు­కో­వా­లి. ము­ఖ్యం­గా చి­న్న వయ­సు­లో­నే ఆడ­పి­ల్లల భవి­ష్య­త్తు కోసం పె­ట్టు­బ­డు­లు పె­ట్ట­డం చాలా అవ­స­రం. సరైన సమ­యం­లో ఇన్వె­స్ట్ చే­య­డం వల్ల ఎక్కువ లా­భా­లు పొం­దొ­చ్చు. జీ­విత బీమా పా­ల­సీ­లు, ఈక్వి­టీ­లు, సు­క­న్య సమృ­ద్ధి యోజన వంటి వా­టి­లో పె­ట్టు­బ­డు­లు పె­ట్ట­డం ద్వా­రా మీ అమ్మా­యి­కి ఆర్థిక భరో­సా కల్పిం­చ­వ­చ్చు. వీ­టి­తో పాటు బం­గా­రం­లో పె­ట్టు­బ­డి పె­ట్ట­డం వల్ల లా­భా­ల­ను పొం­ద­వ­చ్చు. మీ పె­ట్టు­బ­డు­ల­ను ఎప్ప­టి­క­ప్పు­డు సమీ­క్షిం­చు­కుం­టూ ఉం­డా­లి.

సుకన్య సమృద్ధి యోజన

మన జీ­వ­న­శై­లి, జీవన వ్య­యం భవి­ష్య­త్తు­లో మరింత ఉన్నత స్థా­యి­కి చే­రు­కుం­టుం­ది. భవి­ష్య­త్తు పి­ల్ల­ల­దే తమ పి­ల్లల ఆర్థిక భద్రత గు­రిం­చి తప్పక ఆలో­చిం­చా­లి. ఆడ­బి­డ్డల కోసం అం­దు­బా­టు­లో ఉన్న బె­స్ట్ ఇన్వె­స్ట్‌­మెం­ట్ ప్లా­న్స్‌­లో సు­క­న్య సమృ­ద్ధి యోజన ఒకటి. ఈ పథ­కం­లో 15ఏళ్ల పాటు పె­ట్టు­బ­డి పె­ట్టా­ల్సి ఉం­టుం­ది. 10 ఏళ్ల కంటే తక్కువ వయ­స్సు­న్న అమ్మా­యిల పే­రు­తో ఈ అకౌం­ట్ ఓపె­న్ చే­య­వ­చ్చు. ఇం­దు­లో ఏడా­ది­కి గరి­ష్టం­గా 1.5 లక్షల వరకూ పె­ట్టు­బ­డి పె­ట్ట­వ­చ్చు. ఈ పథ­కా­ని­కి ప్ర­స్తు­తం 8.2 శాతం వడ్డీ లభి­స్తోం­ది. ఉదా­హ­ర­ణ­కు మీ చి­న్నా­రి పే­రు­పై నె­ల­కు రూ.5 వేలు పె­ట్టు­బ­డి పె­డు­తూ వె­ళ్తే అమ్మా­యి­కి 21 ఏళ్లు నిం­డాక సు­మా­రు రూ.28 లక్ష­లు వస్తా­యి.

జనరల్ ప్రోవిడెంట్ ఫండ్

ఇక చిన్నారుల కోసం అందుబాటులో ఉన్న మరో బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌లో జనరల్ ప్రోవిడెంట్ ఫండ్ ఒకటి. ఈ పథకంలో పెట్టుబడి పెడితే 7.1శాతం వడ్డీ లభిస్తుంది. గరిష్టంగా ఏడాదికి 1.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు. 15 ఏళ్లు కాల వ్యవధి ఉండే ఈ పథకాన్ని ఇష్టం ఉంటే మరో 5 ఏళ్లు పొడిగించుకోవచ్చు. ఏడాదికి 1.5 లక్షలు పెట్టుబడి పెడితే 15 ఏళ్లకు మీ అమ్మాయికి రూ.40,68,209 చేతికి అందుతాయి. అదే మరో ఐదేళ్లు పొడిగిస్తే మొత్తం 20 ఏళ్లు దాటాక రూ.66,58,288 చేతికి వస్తాయి.

మ్యూచువల్‌ ఫండ్లు

పిల్లల ఉన్నత విద్యకు, ఇతర భవిష్యత్తు అవసరాల కోసం సంప్రదాయ పెట్టుబడి పథకాలతో పాటు మ్యూచువల్‌ ఫండ్లను కూడా ఎంచుకోవచ్చు. మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ విధానాన్ని ఎంచుకోవడం మంచిది. ఉదాహరణకు, 20 ఏళ్ల వయసు వచ్చే నాటికి చదువు కోసం రూ.50 లక్షలు అవసరం పడుతుంది అనుకుందాం. దీని కోసం మీరు 12% సగటు రాబడి అంచనాతో, 15 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ.10 వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

Tags:    

Similar News