Gold and Silver Prices : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Update: 2024-08-17 12:30 GMT

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,150 పెరిగి రూ.72,770కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,050 పెరగడంతో రూ.66,700 పలుకుతోంది. సిల్వర్ రేట్ కేజీపై రూ.2,000 పెరిగి రూ.91,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. సమీప భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. MCXలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.72,800ను తాకొచ్చని అంటున్నారు. US ఫెడ్ వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న సంకేతాలు, డాలర్, ట్రెజరీ బాండు ఈల్డులు తగ్గే అవకాశం ఉండటమే ఇందుకు కారణాలు. కాగా ఈ వారమూ విలువైన లోహాల ర్యాలీ కొనసాగింది. పుత్తడి 2.12, వెండి 3.31% మేర పెరిగాయి. MCXలో 10 గ్రాముల గోల్డ్ రూ.71,395 వద్ద ముగిసింది.

Tags:    

Similar News