Gold Price Drops : బంపర్ న్యూస్.. బంగారం రేట్ భారీగా తగ్గింది

Update: 2024-05-11 08:03 GMT

అక్షయ తృతీయ సీజన్ సందర్భంగా మరో గుడ్ న్యూస్ అందింది. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం లేదా ఏదైనా పండగ ఉన్నా మహిళలు కచ్చితంగా బంగారం కొనుగోలు చేస్తారు. అయితే గత కొద్ది రోజుల నుంచి బంగారం రేట్లు అమాంతం పెరిగిపోతుండటంతో కొనుగోలు దారులు అయోమయంలో పడిపోయారు. మూడు నెలలపాటు పెండ్లి ముహూర్తాలు లేనప్పటికీ బంగారం రేటు పెరుగుతూ టెన్షన్ పెడుతున్నాయి.

అయితే అంతా మే 10న అక్షయ తృతీయ నాడు బంగారం రేట్లు తగ్గుతాయని భావించారు. కానీ రేట్లు మరింత పెరగడంతో కొనడం మానేశారు. ఈ క్రమంలో.. మే 10న బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటితో పోల్చుకుంటే పసిడి రేట్లు తగ్గి కొనుగోలు దారులకు శుభవార్తను అందించాయి. అయితే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 200 తగ్గడంతో రూ. 67, 250కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ.330 తగ్గగా.. 73, 360కి విక్రయిస్తున్నారు.

కిలో వెండిపై రూ. 1300 తగ్గడంతో రూ. 90, 500గా ఉంది. దీంతో.. పెళ్లిళ్లు పెట్టుకున్నవారు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపిస్ుతన్నారు.

Tags:    

Similar News