Gold Prices : భారీగా పెరిగిన బంగారం ధరలు

Update: 2024-06-21 10:18 GMT

ఇటీవల స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.810 పెరిగి రూ.73,250కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 10 గ్రాములకు రూ.750 పెరిగి రూ.67,150గా ఉంది. అటు వెండి ధర కూడా కేజీకి రూ.1400 పెరిగింది. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేట్ రూ.98,500కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,300 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,400

ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.67,150 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,250.

చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,800 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,970.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..

– చెన్నైలో కిలో వెండి రూ.98,500.

– కోల్ కతా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.94,000.

– బెంగళూరులో కిలో వెండి ధర రూ. 92,850 వద్ద కొనసాగుతుంది.

Tags:    

Similar News