Gold Rate: నిన్నటి మాదిరే ఈ రోజు కూడా.. తగ్గిన బంగారం ధర..

బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో పసిడి ప్రియులు బంగారం కొనుగోలుకు ముచ్చటపడుతున్నారు. పండుగ సీజన్లు పురస్కరించుకుని వ్యాపారం వృద్ధి చెందుతుందని పసిడి వర్తకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2021-09-18 05:06 GMT

భారతదేశంలో బంగారం ధరలు శనివారం కూడా తగ్గుముఖం పట్టాయి. పసుపు లోహం 10 గ్రాములకు రూ.650 తగ్గిపోయింది. అలాగే వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ. 61,600 వద్ద ట్రేడవుతున్నాయి. మునుపటి ముగింపు కిలోకు రూ. 62, 800 కాగా ఈ రోజు 1200 తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1,762 డాలర్లు కాగా, వెండి ధర ఔన్స్‌కు 22.95 డాలర్లుగా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.47,350కు క్షీణించింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.600 క్షీణతతో రూ.43,400కు తగ్గింది.

అయితే పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలకు జీఎస్టీ, మేకింగ్ చార్జీలు వంటివి జత చేయలేదు.. అందువల్ల ఈ రేట్లకు రిటైల్ షాపుల్లో రేట్లకు వ్యత్యాసం ఉండొచ్చు.

Tags:    

Similar News