Hyundai Creta : హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ లాంచ్.. కొత్త ఫీచర్లతో ఎస్‌యూవీ కింగ్ అప్‌డేట్.

Update: 2026-04-09 10:30 GMT

Hyundai Creta : భారతదేశంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ కింగ్ అనగానే గుర్తొచ్చే పేరు హ్యుందాయ్ క్రెటా. ఇప్పటికే 14 లక్షల మందికి పైగా కస్టమర్ల మనసు గెలుచుకున్న క్రెటా, ఇప్పుడు తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవడానికి సరికొత్త సమ్మర్ ఎడిషన్‎ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎండలు మండిపోతున్న ఈ వేసవిలో కస్టమర్లను చల్లబరిచేలా అదిరిపోయే ఫీచర్లను హ్యుందాయ్ ఇందులో జోడించింది.

హ్యుందాయ్ క్రెటా తన సెగ్మెంట్‌లో అజేయంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 14 లక్షల యూనిట్లు అమ్ముడవ్వడమే కాకుండా, కేవలం 2026 ఆర్థిక సంవత్సరంలోనే 2 లక్షలకు పైగా కార్లు అమ్ముడయ్యాయి. మార్కెట్లో ఎన్ని కొత్త ఎస్‌యూవీలు వచ్చినా క్రెటా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆ క్రేజ్‌ను అలాగే కాపాడుకోవడానికి ఇప్పుడు మరింత స్టైలిష్‌గా, ఎక్కువ ఫీచర్లతో సమ్మర్ ఎడిషన్‌ను తీసుకువచ్చింది హ్యుందాయ్.

ఈ కొత్త సమ్మర్ ఎడిషన్ ఎంట్రీ లెవల్ EX పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.12.05 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇక టాప్ ఎండ్ SX ప్రీమియం డీజిల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.17.88 లక్షల వరకు ఉంది. ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు కానీ, ఫీచర్ల విషయంలో మాత్రం హ్యుందాయ్ భారీ అప్‌డేట్స్ ఇచ్చింది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు రెండూ అందుబాటులో ఉన్నాయి.

తక్కువ ధరలో లభించే EX వేరియంట్‌లో ఇప్పుడు స్మార్ట్ కీ, పుష్-బటన్ స్టార్ట్ వంటి ఫీచర్లను చేర్చారు. ఇక EX(O) వేరియంట్ లో క్వాడ్-బీమ్ ఎల్ఈడి హెడ్‌లైట్స్, రియర్ విండో సన్‌షేడ్స్, డైనమిక్ గైడ్‌లైన్స్‌తో కూడిన రియర్ కెమెరా వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇక సేఫ్టీ కోసం S(O) వేరియంట్లలో మొబైల్ యాప్‌తో కనెక్ట్ అయ్యే డ్యాష్‌క్యామ్‎ను కూడా అందించడం విశేషం. ఇది డ్రైవింగ్ రికార్డింగ్, ఎమర్జెన్సీ రికార్డింగ్‌కు ఎంతో ఉపయోగపడుతుంది.

హయ్యర్ వేరియంట్లు అయిన SX, SX ప్రీమియంలో లగ్జరీ ఫీచర్లు మరింత పెరిగాయి. కొత్త 10.25 అంగుళాల మల్టీ-డిస్ప్లే డిజిటల్ క్లస్టర్, సరాౌండ్ వ్యూ మానిటర్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లను జోడించారు. ఈ అప్‌డేట్స్ అన్నీ క్రెటాను మరింత సురక్షితంగా, టెక్నాలజీ పరంగా అడ్వాన్స్‌డ్‌గా మార్చాయి. వచ్చే ఏడాది రాబోయే నెక్స్ట్ జనరేషన్ క్రెటాకు ముందు ఇదొక మాస్టర్ ప్లాన్ అని చెప్పొచ్చు.

Tags:    

Similar News