Maruti Suzuki : మారుతి సుజుకి ఏప్రిల్ ధమాకా.. కొత్త కారుపై రూ.45 వేల వరకు తగ్గింపు.

Update: 2026-04-09 10:15 GMT

Maruti Suzuki : కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే మీకు ఇది అదిరిపోయే ఛాన్స్. దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఏప్రిల్ 2026 నెలలో కస్టమర్ల కోసం బంపర్ ఆఫర్లను ప్రకటించింది. తన ఎరీనా డీలర్‌షిప్ ద్వారా లభించే కార్లపై ఏకంగా రూ.45,000 వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ బెనిఫిట్స్ రూపంలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఆల్టో, ఎస్-ప్రెస్సో ఆఫర్లు

మొదటిసారి కారు కొనాలని కలలు కనేవారికి ఆల్టో K10 ఒక బెస్ట్ ఆప్షన్. ఏప్రిల్ నెలలో ఈ కారుపై రూ.37,500 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. అలాగే మారుతి ఎస్-ప్రెస్సో కొనుగోలు పైన కూడా రూ.37,500 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ తో పాటు పాత కారును మార్చుకుంటే వచ్చే ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా కలిసి ఉంటుంది.

వ్యాగన్ఆర్, సెలెరియో

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్లలో ఒకటైన వ్యాగన్ఆర్ పైన కూడా మారుతి ఏప్రిల్ నెలలో రూ.37,500 వరకు రాయితీని ప్రకటించింది. మంచి మైలేజీ ఇచ్చే సెలెరియో పైన కూడా ఇదే తరహా ఆఫర్ అందుబాటులో ఉంది. సిటీ డ్రైవింగ్ కోసం కారు కావాలనుకునే వారు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవచ్చు.

స్విఫ్ట్, బ్రెజా పై అత్యధిక డిస్కౌంట్లు

మారుతి సుజుకి బ్రాండ్ లో అత్యంత క్రేజ్ ఉన్న స్విఫ్ట్ మోడల్ పై ఈసారి భారీగా రూ.45,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇందులో ఆటోమేటిక్ వేరియంట్ పై అత్యధిక డిస్కౌంట్ ఉండగా, మాన్యువల్ వేరియంట్ పై రూ.40,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక ఎస్‌యూవీ లవర్స్ మెచ్చే బ్రెజా పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లపై కూడా రూ.45,000 వరకు ఆఫర్లు ఉన్నాయి.

మారుతి విక్టోరిస్ - స్పెషల్ ఎక్స్ఛేంజ్ బోనస్:

ప్రీమియం మోడల్ అయిన మారుతి విక్టోరిస్ పై ప్రత్యక్షంగా నగదు తగ్గింపు లేకపోయినా, ఎక్స్ఛేంజ్ బోనస్ రూపంలో మంచి ఆఫర్లు ఉన్నాయి. పెట్రోల్ మరియు సీఎన్‌జీ వేరియంట్లపై రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుండగా, హైబ్రిడ్ వేరియంట్ పై ఏకంగా రూ. 30,000 వరకు బోనస్ పొందవచ్చు. అయితే ఈ ఆఫర్లు డీలర్‌షిప్ మరియు నగరాన్ని బట్టి మారవచ్చు కాబట్టి షోరూమ్ కి వెళ్లి కనుక్కోవడం ఉత్తమం.

Tags:    

Similar News