Tata Sierra 2026 : జనవరి 15 నుంచే సియెర్రా డెలివరీలు..డీజిల్ వేరియంట్లకే జై కొడుతున్న జనం.

Update: 2026-01-14 06:30 GMT

Tata Sierra 2026 : టాటా మోటార్స్ తన వింటేజ్ క్లాసిక్ ఎస్‌యూవీ సియెర్రాను సరికొత్త అవతారంలో తీసుకొచ్చి మార్కెట్లో సంచలనం సృష్టించింది. నవంబర్ 25న లాంచ్ అయినప్పటి నుంచి ఈ కారు కోసం కస్టమర్లు ఎగబడుతున్నారు. కేవలం 24 గంటల్లోనే 70,000 బుకింగ్స్ రావడం చూసి ఆటోమొబైల్ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ డిమాండ్‌ను తట్టుకోవడానికి టాటా సంస్థ తన నెలవారీ ఉత్పత్తిని 7 వేల యూనిట్ల నుంచి ఏకంగా 15 వేల యూనిట్ల వరకు పెంచాలని నిర్ణయించింది.

ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్ కార్ల హవా నడుస్తున్నప్పటికీ, సియెర్రా విషయంలో మాత్రం కస్టమర్లు డీజిల్ ఇంజిన్‌కే ఓటు వేస్తున్నారు. మొత్తం బుకింగ్స్‌లో సుమారు 55 శాతం మంది డీజిల్ మోడల్‌ను ఎంచుకోగా, 25 శాతం మంది సాధారణ పెట్రోల్ మరియు 20 శాతం మంది పవర్‌ఫుల్ టర్బో-పెట్రోల్ వేరియంట్లను బుక్ చేసుకున్నారు. లాంగ్ డ్రైవ్స్ మరియు పవర్ కోరుకునే వారికి సయెర్రా డీజిల్ ఫేవరెట్ ఆప్షన్‌గా మారింది.

కొత్త సియెర్రా మొత్తం 6 అద్భుతమైన రంగుల్లో లభిస్తోంది. అండమాన్ అడ్వెంచర్, బెంగాల్ రూజ్, మున్నార్ మిస్ట్, ప్రిస్టైన్ వైట్, ప్యూర్ గ్రే, కూర్గ్ క్లౌడ్ వంటి పేర్లతో వచ్చిన ఈ రంగులు కారుకు మరింత రాయల్ లుక్‌ను ఇస్తున్నాయి. ముఖ్యంగా టాప్-ఎండ్ మోడల్స్ కొనేవారికి ఈ ఆరు రంగుల్లో నచ్చిన దానిని ఎంచుకునే వీలుంది.

సియెర్రా ధరలు రూ.11.49 లక్షల (Smart+ పెట్రోల్) నుంచి ప్రారంభమై, టాప్-ఎండ్ మోడల్ (Accomplished+ డీజిల్ ఆటోమేటిక్) ధర రూ. 21.29 లక్షల వరకు ఉంది. టర్బో-పెట్రోల్ వేరియంట్లు రూ.17.99 లక్షల ప్రారంభ ధరతో లభిస్తున్నాయి. ఈ కారు మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ వంటి దిగ్గజ కార్లకు ముచ్చెమటలు పట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ కారు డెలివరీలు జనవరి 15, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంజిన్ పరంగా చూస్తే:

డీజిల్: 1.5 లీటర్ ఇంజిన్, అన్ని వేరియంట్లలో లభ్యం. ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉంది.

పెట్రోల్: 1.5 లీటర్ ఇంజిన్, మాన్యువల్, DCA ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

టర్బో పెట్రోల్: ఇది కేవలం ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో, అడ్వెంచర్+, అకాంప్లిష్డ్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది.

Tags:    

Similar News