New Car Launches : కార్ల జాతర షురూ..రోడ్లపై కొత్త ఎస్‌యూవీల రచ్చ..ఈ నెలలో రాబోతున్న టాప్ మోడల్స్ ఇవే.

Update: 2026-01-09 07:15 GMT

New Car Launches : కొత్త సంవత్సరం 2026 ప్రారంభమై కేవలం ఎనిమిది రోజులే కావస్తోంది. అప్పుడే ఆటోమొబైల్ రంగం కొత్త మోడళ్లతో హోరెత్తిపోతోంది. ఇప్పటికే మహీంద్రా XUV 7XO, మహీంద్రా XUV 3XO EV, సరికొత్త కియా సెల్టోస్ మార్కెట్లోకి అడుగుపెట్టాయి. అయితే, అసలు సిసలైన సందడి మున్ముందు ఉంది. ఈ జనవరి నెలలో మరిన్ని అద్భుతమైన ఎస్‌యూవీలు, ఎలక్ట్రిక్ వాహనాలు లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి.

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ : టాటా మోటార్స్ తన బెస్ట్ సెల్లింగ్ మైక్రో ఎస్‌యూవీ పంచ్‎ను కొత్త హంగులతో మార్కెట్లోకి తెస్తోంది. 2026 మోడల్‌లో 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఇందులో నెక్సాన్ నుంచి తీసుకున్న 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా రాబోతుండటం విశేషం.

టయోటా అర్బన్ క్రూజర్ ఈవీ : టయోటా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని జనవరి 19, 2026న లాంచ్ చేయనుంది. మారుతి సుజుకి ఈ-విటారా ఆధారంగా రూపొందిన ఈ కారు, ఒకే ఛార్జ్‌తో 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని అంచనా. ఇందులో 49kWh, 61kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండవచ్చు.

నిస్సాన్ గ్రావిటే : నిస్సాన్ ఇండియా తన కొత్త 7-సీటర్ కాంపాక్ట్ ఎంపీవీ గ్రావిటేను జనవరి 21న ఆవిష్కరించనుంది. ఇది రెనాల్ట్ ట్రైబర్ ఆధారంగా తయారైంది. కుటుంబంతో ప్రయాణించే వారికి తక్కువ ధరలో మంచి స్పేస్ కావాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక కానుంది. ఇది మార్చి 2026 నుంచి అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది.

రెనాల్ట్ డస్టర్ : చాలా కాలం నిరీక్షణ తర్వాత, ఐకానిక్ డస్టర్ మూడవ తరం మోడల్ జనవరి 26న భారత్‌లో అడుగుపెట్టనుంది. సరికొత్త డిజైన్, మరింత లగ్జరీ ఇంటీరియర్, 1.3 లీటర్ టర్బో ఇంజిన్‌తో ఇది రాబోతోంది. హై-ఎండ్ వేరియంట్లలో 4X4 డ్రైవ్ సిస్టమ్ కూడా లభించనుంది.

వోక్స్ వ్యాగన్ టాయ్రోన్ : లగ్జరీ, పర్ఫార్మెన్స్‌ను కోరుకునే వారి కోసం వోక్స్ వ్యాగన్ ట్రేయాన్ ను తెస్తోంది. ఇది 7-సీటర్ ప్రీమియం ఎస్‌యూవీ. దీని ధర సుమారు రూ.50 లక్షల వరకు ఉండవచ్చు. ఇందులో 2.0 లీటర్ టీఎస్‌ఐ పెట్రోల్ ఇంజిన్, 4MOTION ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ వంటి టాప్ ఫీచర్లు ఉన్నాయి.

స్కోడా కుషాక్, స్లావియా ఫేస్‌లిఫ్ట్: స్కోడా తన పాపులర్ మోడళ్లయిన కుషాక్ ఎస్‌యూవీ, స్లావియా సెడాన్‌లను అప్‌డేట్ చేస్తోంది. ఈ కొత్త వెర్షన్లలో లెవల్-2 ADAS సేఫ్టీ ఫీచర్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి మార్పులు ఉండబోతున్నాయి.

Tags:    

Similar News