టెలికం దిగ్గజం జియో దీపావళి ధమాకా పేరుతో యూజర్ల కోసం ఆఫర్లు ప్రకటించింది. రూ.899, రూ.3599 రీఛార్జ్ ప్లాన్లపై రూ.3350(ఈజీమై ట్రిప్, AJIO, స్విగ్గీ ఓచర్లు) విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. రూ.899 ప్లాన్ ద్వారా 90 రోజులు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటాతో పాటు అదనంగా 20GB డేటా లభిస్తుంది. రూ.3599 ప్లాన్‌లో 365 రోజులు రోజుకు 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం పొందవచ్చు.
ఈజీమై ట్రిప్‌కు సంబంధించి రూ. 3000 వోచర్ లభించనుంది. ఈ వోచర్‌ను హోటల్స్, ఎయిర్ ట్రావెల్‌కు ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా అజియో షాపింగ్‌కు సంబంధించి రూ. 200 కూపన్ పొందొచ్చు. ఈ ఆఫర్ అక్టోబర్ 25వ తేదీ నుంచి నవంబర్ 5వతేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. రూ. 899తో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటాతో పాటు 20 జీబీ డేటా అదనంగా పొందొచ్చు. అదే విధంగా రూ. 3599తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2.5 జీబీ డేటా 365 రోజులతో లభిస్తుంది.