Kawasaki Ninja 650 : నింజా 650 కొత్త బైక్ ఎక్కితే..గాల్లో తేలినట్టుందే అంటూ పాడాల్సిందే.

Update: 2025-12-26 05:07 GMT

Kawasaki Ninja 650 : సూపర్ బైక్ లవర్స్‎కు కవాసాకి ఇండియా అదిరిపోయే క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చింది. తన పాపులర్ స్పోర్ట్స్ బైక్ నింజా 650లో సరికొత్త మోడల్ 2026 వెర్షన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ధరను రూ.7.91 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. పాత మోడల్‌తో పోలిస్తే దీని ధర సుమారు రూ.14,000 పెరిగినప్పటికీ, దీనికి పోటీగా ఉన్న హోండా CBR650R (ధర రూ.11.16 లక్షలు)తో పోలిస్తే ఇది చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. స్పీడ్, స్టైల్, పెర్ఫార్మెన్స్ కోరుకునే రైడర్లకు ఇది ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

2026 కావాసాకి నింజా 650లో ప్రధాన మార్పు దాని ఇంజిన్ అప్‌డేట్. ఇందులో 649 సీసీ లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది ఇప్పుడు అధునాతన E20 ఫ్యూయల్ (ఎథనాల్ మిశ్రమ ఇంధనం) ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేయబడింది. ఈ ఇంజిన్ 8,000 rpm వద్ద 67 bhp పవర్,6,700 rpm వద్ద 62.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ ఫీచర్ ఉండటం వల్ల గేర్లు మార్చడం చాలా స్మూత్ గా ఉంటుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 212 కిలోమీటర్లు కావడం విశేషం.

సేఫ్టీ, కంట్రోల్‌లో మేటి వేగంతో పాటు భద్రతకు కూడా కావాసాకి పెద్ద పీట వేసింది. ఈ బైక్ ముందు భాగంలో 300 mm డ్యూయల్ డిస్క్ బ్రేకులు, వెనుక భాగంలో 220 mm డిస్క్ బ్రేక్ ఉన్నాయి. వీటికి తోడు డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ సదుపాయం కూడా ఉంది. సస్పెన్షన్ విషయానికొస్తే.. ముందు వైపు 45 mm టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు మోనోషాక్ అబ్జార్బర్‌ను అందించారు. దీనివల్ల లాంగ్ రైడ్స్ లో కూడా బైక్ అద్భుతమైన గ్రిప్, కంఫర్ట్ ఇస్తుంది.

కొత్త నింజా 650లో 4.3 అంగుళాల ఫుల్-కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కలదు. కవాసాకికి చెందిన రైడియాలజీ యాప్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను బైక్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే, రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోగల కవాసాకి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది. డిజైన్ పరంగా పెద్దగా మార్పులు లేకపోయినా, కొత్త గ్రాఫిక్స్, సిగ్నేచర్ లైమ్ గ్రీన్ కలర్ బైక్‌ను మరింత స్పోర్టీగా, అట్రాక్టివ్‌గా మార్చాయి.

Tags:    

Similar News