బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దేశంలోని పలు నగరాల్లో కిలో వెండి ధర రికార్డులు బద్దలు కొట్టి రూ.లక్ష దాటింది. ఈ ధరలు స్పాట్ మార్కెట్‌కి సంబంధించినవి, హైదరాబాద్, చెన్నై నగరాల్లో వెండి ధర చరిత్రలోనే తొలిసారిగా గరిష్టంగా కిలో రూ.1,01,000 చేరింది. ఇతర మార్కెట్లలోనూ వెండి రూ.99,990 అంటే రూ.లక్షకు దగ్గరలో ఉంది.
హైదరాబాద్ నగరంలో కిలో రూ.1,01,000గా ఉంది. ఇతర నగరాలు అయిన చెన్నై, కోయంబత్తూరు, మదురై, విజయవాడ, భువనేశ్వర్, విశాఖపట్నం, కటక్, తిరుపతి, సేలం, గుంటూరులో కూడా ఇదే విధంగా రేట్లు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి రేటు అత్యధికంగా ఉంది. కామెక్స్‌లో వెండిలో 3.18 శాతం కంటే ఎక్కువ పెరుగుదల కనిపించింది. దీనిలో ఔన్స్‌కు 32.138 డాలర్లుగా నమోదవుతోంది.