LIC : పిల్లల భవిష్యత్తుకు భరోసా.. రోజుకు రూ.150 పొదుపుతో రూ.19 లక్షలు మీ సొంతం.

Update: 2026-03-12 08:30 GMT

LIC : ప్రతి తల్లిదండ్రుల కల తమ పిల్లల భవిష్యత్తు బంగారుమయంగా ఉండాలనే. వారి చదువు, పెళ్లిళ్ల కోసం ఇప్పటి నుంచే పొదుపు చేయాలనుకునే వారికి భారతీయ జీవిత బీమా సంస్థ ఒక అద్భుతమైన పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే ఎల్‌ఐసీ న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్. భద్రతతో పాటు మంచి రాబడిని ఇచ్చే ఈ ప్లాన్ ద్వారా మీ పిల్లల ఎదుగుదలలో ఆర్థికంగా ఎలాంటి లోటు లేకుండా చూసుకోవచ్చు.

ఈ ప్లాన్ లో మీరు రోజుకు కేవలం రూ.150 చొప్పున పొదుపు చేస్తే చాలు. అంటే నెలకు సుమారు రూ.4,500 పెట్టుబడి పెట్టినట్లు అవుతుంది. ఈ లెక్కన ఏడాదికి మీరు పొదుపు చేసే మొత్తం రూ.55,000. ఇలా 25 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే, మీరు మొత్తం రూ.14 లక్షల వరకు డిపాజిట్ చేస్తారు. పాలసీ గడువు ముగిసే సమయానికి బోనస్‌లు, ఇతర ప్రయోజనాలు అన్నీ కలిపి సుమారు రూ.19 లక్షల వరకు భారీ ఫండ్ మీ చేతికి వస్తుంది. ఈ నగదు మీ పిల్లల పైచదువులకు లేదా వారి వివాహ ఖర్చులకు కొండంత అండగా నిలుస్తుంది.

ఈ పాలసీని పిల్లలు పుట్టినప్పటి నుంచి (0 ఏళ్లు) 12 ఏళ్ల వయస్సు లోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇది మార్కెట్ రిస్క్ లేని ప్లాన్ కావడం విశేషం. ప్రీమియం చెల్లించడానికి మీకు అనేక వెసులుబాట్లు ఉన్నాయి. మీ ఆదాయాన్ని బట్టి ప్రతి నెలా, మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకు లేదా ఏడాదికి ఒకసారి ప్రీమియం కట్టుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా బీమా మొత్తాన్ని ఎంచుకోవచ్చు, కనీసం రూ.లక్ష నుంచి ఎంతవరకైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు.

ఈ పథకంలోని అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. పిల్లలకు డబ్బు అవసరమయ్యే వయసులో మనీ బ్యాక్ రూపంలో నగదు అందుతుంది. మీ బిడ్డకు 18 ఏళ్లు, 20 ఏళ్లు, 22 ఏళ్లు నిండినప్పుడు మొత్తం బీమా మొత్తంలో 20 శాతం చొప్పున వాపసు ఇస్తారు. అంటే మూడు విడతల్లో 60 శాతం డబ్బు వెనక్కి వస్తుంది. ఆ తర్వాత 25 ఏళ్ల వయస్సులో మిగిలిన 40 శాతం నగదుతో పాటు పాలసీపై వచ్చిన బోనస్‌లన్నీ కలిపి ఒకేసారి అందిస్తారు. ఒకవేళ మధ్యలో మనీ బ్యాక్ తీసుకోవడం ఇష్టం లేకపోతే, మెచ్యూరిటీ సమయంలో వడ్డీతో సహా మొత్తం కలిపి తీసుకోవచ్చు.

Tags:    

Similar News