Maruti Victoris : డెలివరీకి ముందే దుమ్ములేపుతున్న విక్టోరిస్.. 2వారాల్లో 25000వేల బుకింగ్స్

Update: 2025-10-04 11:00 GMT

Maruti Victoris : భారత మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మారుతి సుజుకి సరికొత్త ఎస్‌యూవీ మారుతి విక్టోరిస్ భారీ పాపులారిటీ సంపాదించుకుంది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ మోడల్‌కు ఏకంగా 25,000 బుకింగ్స్ వచ్చాయి. హ్యుందాయ్ క్రెటా వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేందుకు వచ్చిన విక్టోరిస్, పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్, సీఎన్‌జీ వంటి బహుళ ఇంజన్ ఆప్షన్లతో పాటు, అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ భారీ డిమాండ్ కారణంగా విక్టోరిస్‌పై ప్రస్తుతం 10 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది.

మారుతి విక్టోరిస్ మొత్తం ఆరు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. ఇది వినియోగదారులకు బడ్జెట్ నుంచి లగ్జరీ వరకు ఎంచుకునే అవకాశం ఇస్తుంది. విక్టోరిస్ ధరలు రూ.10.5 లక్షల నుంచి రూ.19.99 లక్షల(ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. కొనుగోలుదారులు నెలకు రూ.27,707 నుంచి ప్రారంభమయ్యే నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా కూడా విక్టోరిస్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ నెలవారీ అద్దెలో వాహనం ఖర్చు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్, రోడ్ అసిస్టెన్స్ అన్నీ కలిసే ఉంటాయి.

మారుతి విక్టోరిస్, మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యంత సురక్షితమైన వాహనంగా గుర్తింపు పొందింది. దీనికి భారత్ NCAP, గ్లోబల్ NCAP రెండింటిలోనూ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. దీని స్టాండర్డ్ సేఫ్టీ కిట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ABS తో పాటు EBD, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు ఉన్నాయి. అత్యాధునికమైన లెవెల్-2 ADAS ఫీచర్ టాప్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది.

మారుతి విక్టోరిస్‌లో గ్రాండ్ విటారాలో ఉన్న ఇంజన్ ఆప్షన్లనే అందించారు. పనితీరుతో పాటు, మైలేజ్‌లోనూ ఇది రికార్డు సృష్టిస్తోంది. ఇంజన్ ఆప్షన్ల విషయానికి వస్తే.. 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్. ఇది 103 బీహెచ్‌పీ పవర్ ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్. ఇది 116 బీహెచ్‌పీ పవర్ ఉత్పత్తి చేసి, అత్యధిక మైలేజ్ ఇస్తుంది. 1.5 లీటర్ పెట్రోల్-సీఎన్‌జీ. ఇది 89 బీహెచ్‌పీ పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, e-CVT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ద్వారా విక్టోరిస్ ఏకంగా లీటరుకు 28.56 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఇది భారతదేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లలో ఒకటి.

Tags:    

Similar News