ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ అరుదైన ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్తో పనిలేకుం డా ఆఫ్లైన్లోనే సినిమాలు, షోలను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఒకసారి లోకల్ స్టోరేజ్లో స్టోర్ అయితే వినియోగదారులు ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు, వారు కోరుకున్న ప్రాంతంలో వాటిని వీక్షించవచ్చు. ఈ సదు పాయాన్ని వినియోగించుకోవాలంటే.. నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ తప్పనిసరి. బేసిక్ ప్లాన్ ఒక డివైస్లోనే ఈ సదుపాయాన్ని అనుమతిస్తుంది. అదే హై టైర్ ప్లాన్ అయితే ఒకేసారి ఆరు డివైస్లలో కంటెంట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్రా యిడ్, ఐఓఎస్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. కానీ మ్యాక్, అప్డేట్ చేసిన విండోస్, వెబ్ వెర్షన్లు దీనిని సపోర్ట్ చేయలేవు. అలాగే మీ ఫోన్ మెమొరీ స్టోరేజ్ కూడా ఇందుకు అనుగుణంగా ఉండాలి, లేనిపక్షంలో ఈ ఫీచర్ పనిచేయదు. ఒకసారి డౌన్లోడ్ అయిన కంటెంట్కు ఓ ఎక్స్పైరీ డేట్ ఉంది. గడువు ముగిసిన తర్వాత దానిని చూడాలనుకుంటే మరోసారి డౌన్లోడ్ చేసుకోవాలి. నెట్ ఫ్లిక్స్లో స్మార్ట్ డౌన్లోడ్ అనే ఫీచర్ కూడా ఉంది. ఇది చూసే వీక్షణల ఆధారంగా ఎపిసోడ్లను ఆటోమెటిక్ గా డౌన్లోడ్ చేస్తుంది. ఒకసారి యూజర్లు దానిని చూసిన తర్వాత ఆటోమెటిక్ గా డిలీట్ అయిపోతుంది. మీ అండ్రాయిడ్ ప్లేస్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి నెట్ ఫ్లిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి.