OIL RATES: యుద్ధ బీభత్సం.. చమురు ధరలకు రెక్కలు

పశ్చిమాసియాలో వేడెక్కుతున్న పరిస్థితులు.. అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిపోయిన చమురు ధరలు;

Update: 2025-06-24 06:00 GMT

ఇజ్రా­యె­ల్‌-ఇరా­న్‌ మధ్య నె­ల­కొ­న్న యు­ద్ధ ఉద్రి­క్త­తల నే­ప­థ్యం­లో పశ్చి­మా­సి­యా­లో పరి­స్థి­తు­లు వే­డె­క్కు­తు­న్నా­యి. అమె­రి­కా ఈ యు­ద్ధం­లో జో­క్యం చే­సు­కో­వ­డం­తో పరి­ణా­మా­లు మరింత సు­న్ని­తం­గా మా­రా­యి. అమె­రి­కా జరి­పిన బాం­బు దా­డు­లు, ఇరా­న్ అణు కేం­ద్రాల లక్ష్యం­గా దా­డు­లు జర­ప­డం, హర్మూ­జ్ జల మా­ర్గా­న్ని మూ­సి­వే­త­కు సి­ద్ధ­ప­డ­టం­తో అం­త­ర్జా­తీయ మా­ర్కె­ట్ల­పై తీ­వ్ర ప్ర­భా­వం చూ­పు­తోం­ది.ఈ ఉద్రి­క్త­త­ల­తో చము­రు ధరలు ఒక్క­సా­రి­గా పె­రి­గి­పో­యా­యి. బ్రెం­ట్‌ క్రూ­డ్ బ్యా­రె­ల్‌ ధర 2.7 శాతం పె­రి­గి 79.12 డా­ల­ర్ల­కు చే­ర­గా, యూ­ఎ­స్‌ క్రూ­డ్‌ బ్యా­రె­ల్‌ ధర 2.8 శాతం ఎగ­బా­కి 75.98 డా­ల­ర్ల­ను తా­కిం­ది. ఇది గత ఐదు నె­ల­ల్లో గరి­ష్ఠ స్థా­యి­గా మా­ర్కె­ట్లు గు­ర్తిం­చా­యి. చము­రు సర­ఫ­రా­పై భయాల నే­ప­థ్యం­లో ఇంధన వ్య­యా­లు పె­ర­గ­ను­న్నా­య­న్న అం­చ­నా­ల­తో మా­ర్కె­ట్లు ది­గ­జా­రు­తు­న్నా­యి.

ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం

యుద్ధం ముప్పు, పెరిగిన చమురు ధరలు ఆసియా మార్కెట్లపై నెగటివ్ ప్రభావాన్ని చూపుతున్నాయి. జపాన్ నిక్కీ 0.6 శాతం, దక్షిణ కొరియా కోస్పి 1.4 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.7 శాతం మేర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐరోపా, అమెరికా ఫ్యూచర్ మార్కెట్లూ ఒత్తిడిలో ఉన్నాయి. ఎస్‌అండ్‌పీ 500 ఫ్యూచర్స్‌ 0.5 శాతం, నాస్‌డాక్‌ ఫ్యూచర్స్‌ 0.6 శాతం మేర నష్టాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఔన్సు ధర 0.1 శాతం తగ్గి 3,363 డాలర్లుగా ఉంది. మొత్తంగా ప్రపంచ మార్కెట్లే కాదు, సామాన్య భారతీయుడి జేబుపైనా ఈ యుద్ధ ప్రభావం పడనుంది.

భారత్‌కు ఎదురవుతున్న సవాళ్లు

ఈ ఉద్రి­క్త­త­లు భా­ర­త్‌­కు పె­ద్ద మై­న­స్‌­గా మారే అవ­కా­శం ఉం­ద­ని ఆర్థిక ని­పు­ణు­లు వి­శ్లే­షి­స్తు­న్నా­రు. చము­రు ది­గు­మ­తు­ల­పై ఆధా­ర­ప­డి ఉన్న భా­ర­త్‌­కు ధరల పె­రు­గు­దల పె­ను­భా­రం కా­నుం­ది. అదే సమ­యం­లో పశ్చి­మా­సి­యా దే­శా­ల­తో భా­ర­త్‌ ని­ర్వ­హి­స్తు­న్న వా­ణి­జ్య సం­బం­ధా­లు కూడా ప్ర­తి­కూ­లం­గా మారే ప్ర­మా­దం ఉంది. ము­ఖ్యం­గా ఇరా­క్, జో­ర్డా­న్, లె­బ­నా­న్, సి­రి­యా, యె­మె­న్ దే­శాల ది­శ­గా మన ఎగు­మ­తు­లు అడ్డం­కు­లు ఎదు­ర్కో­వ­చ్చ­ని ని­పు­ణుల అభి­ప్రా­యం. ఇప్ప­టి­కే ఇరా­న్, ఇజ్రా­యె­ల్‌­కు భా­ర­త్ నుం­చి వె­ళ్లే సరు­కు­లు తగ్గు­తు­న్నా­యి. యు­ద్ధం మరింత తీ­వ్ర­మై­తే, భా­ర­త్‌­కు ఇంధన వి­ని­యోగ వ్య­యా­ల­తో పాటు వా­ణి­జ్య రం­గం­లో­నూ షా­క్‌ తప్ప­ద­ని మా­ర్కె­ట్ వర్గా­లు హె­చ్చ­రి­స్తు­న్నా­యి.

Tags:    

Similar News