ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఉద్యోగుల లేఆఫ్ లు ప్రకటించింది. 500 మంది ఉద్యోగులపై వేటు వేసింది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వివిధ విభాగాల్లో పని చేస్తున్న వివిధ స్థాయి ఉద్యోగులను ఇంటికి పంపించినట్లు ఓలా తెలిపింది. ఇటీవల
కాలంలో ఓలా సర్వీసింగ్ విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొంటోంది. దీనిపై కేంద్ర వినియోగదారుల హక్కుల నియంత్రణ సంస్కృ సీసీపీఏ దర్యాప్తుకు కూడా దేశించింది. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జులై నుంచి కొనసాగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దశల వారీగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జరుగుతుందని ఈ వర్గాలు తెలిపాయి. నవంబర్ చివరి నాటికి లేఆఫ్ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను సమర్ధవంతంగా ఉపయోగించుకొ "వడం ద్వారా మార్జిన్లు, లాభదాయకతను పెంచుకోవాలని ఓలా భావిస్తోంది.