డయాబెటిస్, బీపీ సహా 54 రకాల ఔషధాల ధరలను కేంద్రప్రభుత్వం పెంచింది. మధుమేహం రోగులు అధికంగా వినియోగించే మెట్‌ఫార్మిన్, లినాగ్లిప్టిన్, సిటాగ్లిప్టిన్ రేట్లను ట్యాబ్లెట్‌కు రూ.15 నుంచి రూ.20కు పెంచింది. బీపీకి వినియోగించే టెల్మిసార్టన్, క్లోర్థాలిడన్, సిల్ని డిపైన్ మందుల ధరను రూ.7.14గా సవరించింది. యాంటీ బ్యాక్టీరియల్ ఇంజెక్షన్ సిప్రోఫ్లోక్సాసిన్, కాల్షియం, విటమిన్ డీ3 పిల్స్ రేట్లు సైతం పెరిగాయి.
డయాబెటిస్ రోగులు అధికంగా వినియోగించే మెట్‌ఫార్మిన్, లినాగ్లిప్టిన్, సిటాగ్లిప్టిన్ ధరలను ట్యాబ్లెట్‌కు రూ.15 నుంచి రూ.20 కూ పెంచారు. సిప్రోఫ్లోక్సాసిన్ యాం టీ బ్యాక్టీరియల్ ఇంజెక్షన్ రిటైల్ ధరను మిల్లీలీటర్‌కు 23 పైసలుగా నిర్ధారించారు. రక్తపోటుకు వినియోగించే టెల్మీసార్టన్, క్లోర్తాలిడోన్, సిల్నిడిపైన్ మందుల ధరను ట్యాబ్లెట్‌కు రూ.7.14గా సవరించారు.
కొలెస్ట్రాల్ చికిత్సకు ఉపయోగించే ఆస్పిరిన్, ఆటోర్వాస్టాటిన్ కాంబినేషన్ మందును క్యాప్సుల్‌కు రూ.2.68గా మార్చారు. ఇక కాల్షియం, విటమిన్ డీ3 పిల్స్ ధరలను ట్యాబ్లెట్‌కు రూ.7.82 వద్ద ఫిక్స్ చేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, NPPA నిర్ణయం మేరకు.. మధుమేహం, రక్తపోటు, గుండె సమస్యలు, మల్టీవిటమిన్‌లు, బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు, అలర్జీలకు సంబంధించిన ట్యాబ్లెట్స్, ఫార్ములేషన్‌లకు రేట్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం సవరించింది.