Reliance Jio Tag Air : రిలయన్స్ జియో ట్యాగ్ ఎయిర్.. మీ వస్తువులను పట్టిస్తుంది
రిలయన్స్ జియో మార్కెట్లోకి మరో స్మార్ట్ పరికరాన్ని తీసుకు వచ్చింది. గతంతో జియోట్యాగ్ పేరుతో ఒక డివైజ్ ను తీసుకు వచ్చిన రిలయన్స్ జియో తాజాగా జియో ట్యాగ్ ఎయిర్ ను విడుదల చేసింది. ఈ డివైజ్ యూజర్ల తాళాలు, లగేజీ, వాలెట్, పెంపుడు జంతువులు మిస్ అవ్వకుండా ఉండేందుకు ఉపయోగించవచ్చు.
తరచుగా చాలా మంది ఏ వస్తువు ఎక్కడ పెట్టారో మరిచిపోయి తెగ వెతుకుతారు. ఇలాంటి వారికి ఈ డివైజ్ బాగా ఉపయోగపడుతుంది. జియో ట్యాగ్ ఎయిర్ ధరను ప్రారంభ ఆఫర్ గా 1,499 రూపాయలకు ఇవ్వనున్నట్లు రిలయన్స్ జియో తెలిపింది. బ్లూ, గ్రే, రెడ్ కలర్స్ లో లభించే జియో ట్యాగ్ ఎయిర్ ను జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్, అమెజాన్ ఇండియాలో కొనుగోలు చేయవచ్చు. దీంట్లో బిల్ట్ ఇన్ స్పీకర్ ఉంటుంది. బరువు 10 గ్రాములు. ఇందులో అమర్చిన బ్యాటరీ 12 నెలలు పని చేస్తుందని జియో తెలిపింది.
క్రెడ్, పేటీఎంతో పాటు ఇతర ఎంపిక చేసిన కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. జియో ట్యాగ్ ఎయిర్ రెండు రకాల ట్రాకింగ్ యాప్స్ తో పని చేస్తుంది. ఆండ్రా యిడ్ యూజర్లు జియో థింగ్స్ యాప్ తో దీన్ని ఉపయోగించవచ్చు. యాపిల్ యూజర్లు ఫైండ్ నెట్వర్క్ యాప్ ద్వారా ఈ డివైజ్ ను ఉపయోగించవచ్చు.