Gold Prices : పెరుగుతున్న బంగారం ధరలు

Update: 2024-07-30 10:15 GMT

పార్లమెంట్ 2024 - 25 బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు గోల్డ్ పై కస్టమ్ ట్యాక్స్ ను 15 నుంచి 6 శాతానికి తగ్గించారు. దీంతో ఇండియాలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అప్పుడు చాలామంది బంగారం కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు. ఐతే.. ఇప్పుడు మళ్లీ సీన్ మారింది.

మళ్లీ ఇప్పుడు నెమ్మదిగా బంగారం రేట్లు పెరుగుగున్నాయి. జూలై 29న 22 క్యారెట్స్ తులం బంగారం విలువ రూ.63 వేల 100, 24 క్యారెట్స్ రూ.69 వేల 160 లుగా ఉంది. మూడు రోజుల్లోనే దాదాపు రూ.400 పెరిగింది. అప్పుడే కొంత కొని ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News