ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతున్న వేళ చిన్న కార్లు సహా పలు మోడల్స్ విక్రయాలు స్లో అవడంపై డీలర్లు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. వివిధ కార్ల బ్రాండ్లకు చెందిన 4.5లక్షల యూనిట్లు డీలర్ల వద్దే ఉండిపోయాయట. వీటి విలువ దాదాపు రూ.54వేల కోట్లు ఉంటుందని అంచనా. ముఖ్యంగా మారుతీ, హ్యుందాయ్ డీలర్లకు ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక తయారీ ప్లాంట్లలోనూ రూ.20వేలకోట్ల విలువైన స్టాక్ ఉండిపోయినట్లు సమాచారం.
డీలర్లకు స్టాక్ ఇవ్వడం వరకే సంస్థలు ప్రాధాన్యం ఇవ్వడం, కొనుగోలుదారుల ఛాయిస్ మారడం సేల్స్ నెమ్మదించడానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. దీంతో డీలర్లు డిస్కౌంట్లు ఇవ్వాల్సి వస్తోంది. అత్యధికంగా హ్యుందాయ్‌లో కోనా ఎలక్ట్రిక్‌కు రూ.3లక్షలు, జిమ్నీకి రూ.50వేలు, టాటాలో నెక్సాన్ పెట్రోల్ 2023 మోడల్‌కు రూ.55వేల డిస్కౌంట్ ఉంటోంది. 20 రోజుల్లో సేల్ అయ్యే స్టాక్‌కు 50 రోజులు పడుతోందని డీలర్లు వాపోతున్నారు.