Simple Energy : మార్కెట్‌లో కొత్త బాద్‌షా.. సింపుల్ ఎనర్జీ దూకుడు.. లక్ష యూనిట్ల అమ్మకాలతో రికార్డు.
Simple Energy : ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ అక్టోబర్ 2025లో తన చరిత్రలోనే అత్యుత్తమ అమ్మకాలను నమోదు చేసింది. ఈ నెలలో కంపెనీ మొత్తం 1,050 యూనిట్లను విక్రయించింది. ఇది వారికి ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. ముఖ్యంగా ఈ అమ్మకాలు 2024-25 ఆర్థిక సంవత్సర మొత్తం ఆదాయం కంటే 125% ఎక్కువ కావడం గమనార్హం. ఇది మార్కెట్‌లో సింపుల్ ఎనర్జీ ఈ-స్కూటర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోందని స్పష్టం చేస్తుంది.
అక్టోబర్‌లో తెలంగాణ రాష్ట్ర గణాంకాలు లేకుండానే 974 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. దీనికి తోడు తెలంగాణలో 76 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ విధంగా అక్టోబర్ నెల సింపుల్ ఎనర్జీకి ఇప్పటివరకు అత్యంత విజయవంతమైన నెలగా నిలిచింది. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, కంపెనీ వెంటనే తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంది.
తమిళనాడులోని హోసూర్‌లో ఉన్న కంపెనీ 2 లక్షల చదరపు అడుగుల తయారీ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 40% వరకు పెంచింది. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల సంఖ్యను పెంచారు. మార్కెటింగ్ బృందం కూడా ఇప్పుడు 40 మందికి పైగా నిపుణులతో మునుపటి కంటే బలంగా మారింది. వేగంగా పెరుగుతున్న డిమాండ్, భవిష్యత్ విస్తరణను దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు అవసరమని కంపెనీ తెలిపింది.
సింపుల్ ఎనర్జీ ఈ వృద్ధికి కారణం దాని రెండు ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. Simple ONE Gen 1.5, Simple OneS. ఈ రెండు మోడళ్లు జనవరి 2025లో విడుదలయ్యాయి. వాటి మంచి రేంజ్, డిజైన్ కారణంగా త్వరగా ప్రాచుర్యం పొందాయి. Simple ONE Gen 1.5 IDC రేంజ్ 248 కిలోమీటర్లు కాగా, Simple OneS 181 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. పొడవైన రేంజ్, ఆకర్షణీయమైన డిజైన్, తక్కువ నిర్వహణ ఖర్చులు వీటి ప్రత్యేకతలు.
ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 61 రిటైల్ అవుట్‌లెట్‌లు నడుస్తున్నాయి. రాబోయే నెలల్లో కంపెనీ ఢిల్లీ, భోపాల్, పాట్నా, రాంచీ, భువనేశ్వర్ వంటి పెద్ద నగరాల్లో కూడా తమ ఉనికిని విస్తరించనుంది. ఇది కంపెనీకి మరింత ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవడానికి సహాయపడుతుంది. సింపుల్ ఎనర్జీ ఇప్పుడు తమ పర్ఫామెన్స్ బేస్డ్ లైనప్‌తో పాటు ఒక ఫ్యామిలీ-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై కూడా పని చేస్తోంది. ఈ కొత్త మోడల్ ఎక్కువ స్టోరేజ్, ఫ్లాట్ సీట్, మంచి డిజైన్‌తో వస్తుందని భావిస్తున్నారు. అయితే, కంపెనీ దీని విడుదల తేదీ గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.