దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఆటో, మెటల్, బ్యాంకింగ్ రంగాల షేర్లు రాణించడంతో మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 73వేల ఎగువ ముగిసింది. కిత్రం సెషన్‌తో పోలిస్తే ఉదయం సెన్సెక్స్ స్వల్ప నష్టాల్లో మొదలవగా.. ఆ తర్వాత కోలుకుంది.
మంగళవారం 72,683.99 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. గరిష్ఠంగా 73,286.26 పాయింట్లకు పెరిగింది. చివరకు 328.48 పాయింట్లు పెరిగి.. 73,104.61 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 113.80 పాయింట్లు పెరిగి.. 22,217.85 వద్ద ముగిసింది.
నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎంఅండ్‌ఎం, హీరోమోటోకార్ప్, లార్సెన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఓఎన్‌జీసీ, హిందాల్కో లాభాల్లో ట్రేడయ్యాయి. సిప్లా, టీసీఎస్, నెస్లే, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాల్లో ముగిశాయి.