దేశంలో ఎన్నికలవేళ చమురు మార్కెటింగ్ కంపెనీలు మరో రిలీఫ్ ఇచ్చాయి. మే నెల మొదటి రోజున ఎల్‌పిజి సిలిండర్ ధరను సవరించాయి. కొత్త సిలిండర్ ధరలు నేటి నుంచి అమలులోకి వచ్చాయి. వాణిజ్య సిలిండర్ ధరను చమురు కంపెనీలు రూ.19 తగ్గించడంపై అంతటా హర్షం వ్యక్తం అవుతోంది.
కమర్షియల్ సిలిండర్ ధరలు వరుసగా రెండో నెల కూడా తగ్గాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1745.50కి తగ్గింది. కోల్‌కతాలో రూ.1,859కి, ముంబైలో రూ.1698కి, చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,911కి తగ్గింది.
ఇటీవల ఇచ్చిన తగ్గింపుతో డొమెస్టిక్ సిలిండర్ రూ.803కు దిగింది