Tata Motors : టాటా కార్లపై బంపర్ ఆఫర్.. ఆల్ట్రోజ్ నుంచి హారియర్ వరకు రూ.1.40లక్షల భారీ తగ్గింపు.
Tata Motors : పండుగ సీజన్‌లో తమ కార్ల అమ్మకాలు పెంచుకునేందుకు కంపెనీలు కస్టమర్‌లను ఆకర్షించేందుకు ఎలాంటి అవకాశాన్ని అయిన వదలడం లేదు. మీరు కూడా టాటా మోటార్స్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కారు కొనాలని చూస్తున్నట్లయితే, ఈ అక్టోబర్ నెలలో రూ.1.40 లక్షల వరకు ఆదా చేసుకునే గొప్ప అవకాశం ఉంది. టాటా ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్, సఫారీ, కర్వ్ వంటి ప్రసిద్ధ మోడళ్లపై కంపెనీ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఇటీవల జీఎస్టీ రేట్ల తగ్గింపు తర్వాత ఈ అదనపు డిస్కౌంట్లు, కంపెనీ అమ్మకాలను మరింత పెంచడానికి సహాయపడతాయి.
హారియర్, సఫారీపై ఆఫర్లు టాటా ప్రీమియం ఎస్‌యూవీలైన హారియర్, సఫారీలపై మంచి ఆఫర్లు అందిస్తోంది. టాటా హారియర్ 2024 మోడల్ పై రూ.50,000 క్యాష్ డిస్కౌంట్ తో పాటు, రూ.25,000 ఎక్స్ఛేంజ్/స్క్రాప్ బోనస్ లభిస్తుంది. 2025 మోడల్ పై కూడా రూ.33,000 నుంచి రూ.58,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.
టాటా సఫారీ 2024 మోడల్ పై కూడా రూ.50,000 క్యాష్, రూ.25,000 ఎక్స్ఛేంజ్/స్క్రాప్ బోనస్ అందుబాటులో ఉంది. 2025 మోడల్‌ను కొనుగోలు చేసేవారు రూ.33,000 నుంచి రూ.58,000 వరకు లాభం పొందవచ్చు.
ఆల్ట్రోజ్, పంచ్‌పై డిస్కౌంట్లు టాటా ఆల్ట్రోజ్/ ఆల్ట్రోజ్ రేసర్ 2024 మోడల్ పై రూ.40,000 నుంచి రూ.85,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 నుంచి రూ.50,000 వరకు ఎక్స్ఛేంజ్/స్క్రాప్ బోనస్ లభిస్తుంది. 2024 మోడల్‌పై కస్టమర్‌లు మొత్తంగా రూ.1.40 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. 2025 ఫేస్‌లిఫ్ట్‌కు ముందు మోడల్ పై రూ.40,000 క్యాష్, రూ.25,000 ఎక్స్ఛేంజ్/స్క్రాప్ బోనస్ ఇస్తున్నారు.
టాటా పంచ్ 2024 మోడల్ ఎస్‌యూవీపై రూ.25,000 క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 2025 మోడల్ పై రూ.5,000 క్యాష్, రూ.15,000 ఎక్స్ఛేంజ్/స్క్రాప్ డిస్కౌంట్ లభిస్తోంది.
నెక్సాన్, కర్వ్‌పై ఆఫర్లు టాటా నెక్సాన్ 2024 మోడల్ పై రూ.35,000 క్యాష్, రూ.10,000 ఎక్స్ఛేంజ్/స్క్రాప్ బోనస్ లభిస్తుంది. 2025 మోడల్ పై రూ.10,000 క్యాష్, రూ.15,000 ఎక్స్ఛేంజ్/స్క్రాప్ బోనస్ పొందవచ్చు.
టాటా నుండి వచ్చిన మొదటి కూపే ఎస్‌యూవీ కర్వ్ మోడల్‌పై కూడా ఆఫర్లు ఉన్నాయి. 2024 మోడల్ పై రూ.30,000 క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు.2025 మోడల్ పై రూ.20,000 క్యాష్, రూ.20,000 ఎక్స్ఛేంజ్/స్క్రాప్ బోనస్ లభిస్తుంది. ఈ ఆఫర్లు పాత (2024) మోడళ్లను త్వరగా విక్రయించడానికి కంపెనీకి సహాయపడతాయి. అదే సమయంలో కొనుగోలుదారులకు రూ.1.40 లక్షల వరకు ఆదా చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని అందిస్తున్నాయి.