ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ తన నెక్సాన్ లైనప్‌లో సీఎన్‌జీ వేరియంట్‌తో కొత్త ఎస్‌యూవీని తీసుకొచ్చింది. ఈ నెక్సాన్ ఐసీఎన్‌జీ ధర రూ.8.99 (ఎక్స్- షోరూమ్) లక్షల నుంచి ప్రారంభం అవుతుందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే నెక్సాన్‌లో పెట్రోల్, డీజిల్, ఈవీ వేరియంట్లు ఉన్నాయి. తాజాగా అత్యాధునిక ఫీచర్లతో సీఎన్‌జీ వేరియంట్‌ను జోడించినట్లు టాటా మోటార్స్ తెలిపింది. 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో నెక్సాన్ ఐసీఎన్‌జీ తీసుకొచ్చింది. ఇది 98 బీహెచ్ పీ, 170 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అత్యంత శక్తిమంతమైన వాహనాల్లో ఇదీ ఒకటి. డ్యూయల్ సిలిండర్ సదుపాయంతో ఈ ఐసీఎన్‌జీని లాంచ్ చేశారు. రెండు స్లిమ్ సిలిండర్లు ఉండడంతో కార్గో ఏరియా విశాలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. 6 ఎయిర్ బ్యాగ్‌లు భద్రతా ఫీచర్లను జోడించినట్లు కంపెనీ చెబుతోంది. హారియర్, సఫారితో ఎంతో ఆదరణ పొందిన రెడ్ డార్క్ ఎడిషన్‌ను దీంట్లోనూ తీసుకొచ్చారు. పనోరమిక్ సన్‌రూఫ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 360 డిగ్రీల కెమెరా, లెథర్ సీట్లు, నావిగేషన్ డిస్‌ప్లే ఇందులో ఉంటుంది.