Tata Punch : డిస్కౌంట్లతో షాకిస్తున్న టాటా పంచ్..రూ.50 వేలు ఆదా చేసుకునే గోల్డెన్ ఛాన్స్.
Tata Punch : టాటా మోటార్స్ తన పాపులర్ మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ పై భారీ ఆఫర్లను ప్రకటించింది. కొత్త ఏడాది 2026 ప్రారంభంలోనే ఈ కారుపై ఏకంగా రూ.50,000 వరకు స్టాక్ క్లియరెన్స్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అయితే, ఈ ఆఫర్ వెనుక ఒక బలమైన కారణం ఉంది. టాటా పంచ్ తన కొత్త వెర్షన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ జనవరి 13, 2026న అధికారికంగా లాంచ్ కానుంది. కొత్త మోడల్ వస్తుండటంతో, డీలర్ల వద్ద ఉన్న పాత స్టాక్‌ను త్వరగా క్లియర్ చేయడానికి టాటా మోటార్స్ ఈ రూ.50,000 తగ్గింపును ప్రకటించింది. హ్యుందాయ్ ఎక్స్‌టర్, మారుతి ఫ్రాంక్స్ వంటి కార్లతో పోటీ పడుతున్న పంచ్, కొత్త అప్‌డేట్‌తో మార్కెట్‌ను ఏలాలని చూస్తోంది.
కొత్త టాటా పంచ్ డిజైన్ దాదాపు పంచ్ ఈవీని పోలి ఉంటుంది. ఇందులో సరికొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్లు, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి మార్పులు ఉండబోతున్నాయి. ముఖ్యంగా సేఫ్టీ పరంగా ఇందులో 360-డిగ్రీ కెమెరా, ADAS (లెవల్ 2) వంటి హైటెక్ ఫీచర్లు యాడ్ అవుతాయని సమాచారం. లోపల పెద్దదైన 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, కొత్త స్టీరింగ్ వీల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండనున్నాయి.
మీకు తక్కువ బడ్జెట్‌లో మంచి సేఫ్టీ ఉన్న కారు కావాలంటే, ఇప్పుడున్న పంచ్ బెస్ట్ ఆప్షన్. దీనికి గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది. ఇందులో 1.2 లీటర్ రెవోట్రాన్ ఇంజన్ ఉంటుంది, ఇది 86 PS పవర్, 113 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇది లీటరుకు దాదాపు 18.97 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. తక్కువ ధరకు, అంటే రూ.5.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే ఒక బలమైన ఎస్‌యూవీని సొంతం చేసుకునేందుకు ఈ డిస్కౌంట్ పీరియడ్ ఒక మంచి అవకాశం.