Telecom Price War in India : పెరిగిన ధరలు.. BSNLకు మారుతామంటోన్న యూజర్లు!
సిగ్నల్ సరిగా రాకపోవడం, రీఛార్జ్ ధరలు పెంచేయడంతో జియో యూజర్లు Airtelకు మారుదామనుకున్నారు. తాజాగా Airtel కూడా ధరలు పెంచడంతో యూజర్లు షాక్‌లో ఉన్నారు. ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ BSNL బెటర్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా BSNL 4G సేవలు ప్రారంభం కానున్నాయి. దీంతో నెట్‌వర్క్ మారిపోవడం బెటర్ అని, 5G తెస్తే ఇంకా మేలని కామెంట్స్ చేస్తున్నారు.
జియో రెండు నెలల ప్రణాళికలు కూడా విడిచిపెట్టబడలేదు.
రోజుకు రూ.479 ఉండే 1.5 జీబీ ప్లాన్ ఇప్పుడు రూ.579.
రోజుకు 2 జీబీ ప్లాన్ రూ.533 నుంచి రూ.629కి పెంచారు
అదనంగా మూడు నెలల 6 జీబీ డేటా ప్లాన్ ఇప్పుడు రూ.479.. మునుపటి ధర రూ.395.
రోజుకు 2.5 GB ప్లాన్ రూ. 349 నుంచి రూ. 399కి పెంచారు.
రోజుకు 3 GB ప్లాన్ రూ. 399 నుంచి రూ. 449కి పెరుగుతోంది.
నిన్న జియో రీఛార్జ్ రేట్లు పెరగ్గా.. తాజాగా Airtel టారిఫ్స్ పెరిగాయి. జులై 3 నుంచి పెంచిన ధరలు దేశంలోని అన్ని సర్కిళ్లకు వర్తిస్తాయని భారతీ ఎయిర్‌టెల్ పేర్కొంది. రూ.179ను రూ.199కి, రూ.299ను రూ.349కి, రూ.399ని రూ.449కి రూ.455ను రూ.509కి పెంచింది. మొత్తంగా Airtel రీఛార్జ్ ధరలు 10-21% పెరిగాయి.