TRUMP: భారత్‌పై విషం కక్కిన ట్రంప్

ఇండియాను దెబ్బతీసేలా డొనాల్డ్ ట్రంప్ ప్లాన్;

Update: 2025-05-16 02:30 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోదీ మధ్య స్నేహం విడదీయరానిది. దోస్త్ మేరా దోస్త్ అంటూ నిత్యం వీరి స్నేహం సాగుతుందని మీడియాలో జరుగుతున్న ప్రచారం. కానీ, ట్రంప్ రూటే సెపరేటు. ఎంత మంచి స్నేహితుడైనా.. వాణిజ్యం విషయంలో మాత్రం ట్రంప్ వెనక్కి తగ్గడంలేదు. భారత్ విషయంలోనూ ఇదే చేసి చూపించాడు. మొన్నటి మొన్న పాక్, భారత్ మధ్య కుదరిన సీజ్‌ ఫైర్‌కు తానే కారణమన్న ట్రంప్... అభివ‌ద్ధిలో మాత్రం భారత్ నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రపంచ ఆర్థికశక్తిగా భారత్ ఎదుగుదలను సహించలేకపోతున్నాడు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో 2.O ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ట్రంప్.. ప్రముఖ కంపెనీలన్ని అమెరికాకు రావాలని పట్టుదలతో ఉన్నాడు. ఇదే క్రమంలో భారత్‌లోని పెట్టుబుడులను కూడా లాగేసుకుంటున్నాడు. తాజాగా యాపిల్ కంపెనీ భారత్ ఎంట్రీని అడ్డుకునే ప్రయత్నం చేశాడు.

ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన తరువాత ప్రపంచ దేశాల ఎగుమతులపై అత్యధిక సుంకాలు విధించాడు. ముఖ్యంగా చైనాపై 200 శాతంపైగా సుంకాలు వేసి డ్రాగన్ కంట్రీకి షాకిచ్చాడు. దీంతో యాపిల్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాలోని తన పరిశ్రమలో మేజర్ పార్టుని భారత్‌కు తరలించాలని భావించింది. దీని కోసం ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది. అయితే, ఇక్కడే ట్రంప్‌నకు మండినట్లు ఉంది. అత్యధిక సుంకాలు విధిస్తే... అయితే, గియితే.. కంపెనీలు అమెరికాకు రావాలి గానీ.. భారత్‌కు పోవడమేంటని అక్కసు వెళ్లగక్కుతున్నాడు. తాజాగా దోహా నగరంలో నిర్వహించిన వాణిజ్య ప్రెస్ మీటింగ్‌లో డొనాల్డ్ ట్రంప్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు.

యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ వేదికపై ఉండానే భారత్‌లో పెట్టుబడులు పెట్టొద్దని చెప్పాడు. ‘ నాకు టిమ్ కుక్ తో చిన్న సమస్య ఉంది. నేను అతనికి చెప్పాను. మై ఫ్రెండ్. నేను నిన్ను బాగానే చూసుకుంటున్నా. మీరు 500 కోట్ల డాలర్ల పెట్టుబడులతో ముందుకొస్తున్నారని విన్నాను. ఈ పెట్టుబడులు భారత్ లో పెడుతున్నారని విన్నాను. మీరు భారత్ ను ఎంచుకోవడం నాకు ఇష్టం లేదు. మీకు ఇండియా అభివృద్ధి చెందాలి.. మా కంపెనీకి ఏమైనా పర్వాలేదు అంటే మీ ఇష్టం. భారత్‌లో టారిఫ్‌లు చాలా అధికం. దాని వల్ల ఆ దేశం లాభపడుతుంది. కానీ యాపిల్ కూ ఏమీ రాదు. అందుకే నేను ఈ మాటలు చెప్తున్నా’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. భారత్ వాళ్లని వాళ్లు చూసుకోగలరని.. యూఎస్‌పై మీద దృష్టి పెట్టండని కుక్‌‌కు చిన్నపాటి కటింగ్ వేశాడు. ట్రంప్ వంటి నేతలు అడ్డుపడినా.. భారతదేశాన్ని ఆర్థిక శక్తిగా ఎదగడంలో ఎవరు అడ్డుపడలేరనేది నగ్న సత్యం. 

Tags:    

Similar News