Elon Musk : మరో ట్విస్ట్ ఇచ్చిన ఎలన్ మస్క్.. ట్విట్టర్ - టెస్లా డీల్ వాయిదా
Elon Musk : టెస్లా - ట్విట్టర్ డీల్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ ట్వీట్ ద్వారా ప్రకటించారు.;
Elon Musk : టెస్లా - ట్విట్టర్ డీల్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ ట్వీట్ ద్వారా ప్రకటించారు. ట్విట్టర్ నుంచి స్పామ్ బాట్స్‌ని తొలగించడం తన ప్రాధాన్యతల్లో ఒకటన్నారు. స్పామ్, ఫేక్ అకౌంట్ల విషయంలో వివరాలు పెండింగ్‌లో ఉన్నాయని, అందుకే ఆ డీల్‌కు తాత్కాలికంగా బ్రేకేసినట్లు మస్క్ వెల్లడించారు. ఎలాన్ మస్క్ 44బిలియన్ డాలర్ల డీల్‌తో ట్విట్టర్‌ని సొంతం చేసుకుంటున్నట్టు గతంలో ప్రకటించారు.
అయితే ...ఈ డీల్‌కు బ్రేక్ పడిందని ఆయన ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. మస్క్ ప్రకటనతో ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో ట్విట్టర్ షేర్లు 20 శాతం పడిపోయాయి. దీనిపై తక్షణమే స్పందించేందుకు ట్విట్టర్ నిరాకరించింది. తమ కంపెనీ యూజర్లలో కేవలం 5 శాతం మాత్రమే ఫేక్ లేదా స్పామ్ అకౌంట్లు ఉన్నట్లు ట్విట్టర్ గతంలో తెలిపింది. మరోవైపు ఇవాళ ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించింది ట్విట్టర్.