Elon Musk : మస్క్ మాస్టర్ ప్లాన్... ట్విట్టర్ వీడియో యాప్..
ప్లాట్‌ఫామ్‌లో పెరుగుతున్న వీడియో కంటెంట్‌పై దృష్టి పెట్టడానికి కంపెనీ కొత్త ప్రణాళికలకు అనుగుణంగా ట్విట్టర్ చర్యలు తీసుకుంటోంది. డిజిటల్ ప్రకటనలకు మించి సోషల్ మీడియా కంపెనీ వ్యాపారాన్ని విస్తరించబోతున్నట్టు ట్విట్టర్ ప్రకటించింది.;
మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విటర్... టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హస్తగతం య్యాక ఎన్నో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ట్విటర్ బ్లూ సబ్‌స్క్రైబర్ల నుంచి పెద్ద సైజ్ వీడియోలను అప్‌లోడ్ చేసే వరకు ఎన్నో మార్పులు జరిగాయి. ఇప్పుడు మరో భారీ సంస్కరణకు మస్క్ సిద్ధమవుతున్నారు. స్మార్ట్‌టీవీ యూజర్ల కోసం ట్విటర్ వీడియో యాప్‌ను త్వరలో పరిచయం చేయనున్నారు. యూట్యూబ్‌కు పోటీగా తీసుకొస్తున్న ఈ యాప్‌లో యూజర్లు వీడియోలను అప్‌లోడ్ చేయొచ్చు. ట్విట్టర్ ప్రణాళికల్లో ఇది కూడా ఉందని ఉందని ఎలాన్ మస్క్ తెలిపారు. ప్లాట్‌ఫామ్‌లో పెరుగుతున్న వీడియో కంటెంట్‌పై దృష్టి పెట్టడానికి కంపెనీ కొత్త ప్రణాళికలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇన్వెస్టర్ ప్రజంటేషన్‌లో డిజిటల్ ప్రకటనలకు మించి సోషల్ మీడియా కంపెనీ వ్యాపారాన్ని విస్తరించబోతున్నట్టు ట్విట్టర్ కొత్త సీఈఓ లిండా యాకారినో, ఎలాన్ మస్క్ వివరించారు. ఇందుకోసం ట్విట్టర్ వీడియో, క్రియేటర్, వాణిజ్య భాగస్వామ్యాలపై దృష్టి పెట్టేలా ట్విట్టర్ ప్రణాళికలు రూపొందించినట్టు వివరించారు. ఒక స్లైడ్ ట్విట్టర్‌లో గడిపిన సమయానికి 10 శాతం కంటే ఎక్కువ సమయం వర్టికల్ వీడియోలకు ఉందని పేర్కొంది. కంటెంట్ క్రియేటర్ల నుంచి వీడియోలతో పాటు ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌లను అమ్మవచ్చని ట్విట్టర్ అంచనా వేస్తోంది. సోషల్ మీడియా కంపెనీ వ్యాపారాన్ని పునరుద్ధరించడానికి ట్విట్టర్ వీడియో, క్రియేటర్, కామర్స్ పార్ట్‌నర్‌షిప్స్‌పై దృష్టి పెట్టాలని యోచిస్తోందని ట్విట్టర్ ఒక ప్రకటనలో తెలిపింది. రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, పేమెంట్ సర్వీసెస్, వార్తా సంస్థలు, మీడియా పబ్లిషర్‌లతో కంపెనీ ముందస్తు చర్చలు జరుపుతోందని ట్విట్టర్ సీఈఓ యాకారినో చెప్పారు.