UPS Layoffs : లాజిస్టిక్స్ దిగ్గజం UPSలో భారీ లేఆఫ్స్.. 48,000 మంది ఉద్యోగులను తొలగించిన కంపెనీ.

Update: 2025-10-30 07:23 GMT

UPS Layoffs : ప్రపంచంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్ కంపెనీలలో ఒకటైన UPS, గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఏకంగా 48,000 మంది ఉద్యోగులను తొలగించి షాకిచ్చింది. లాభాలను పెంచుకోవడానికి, ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగించడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ స్వయంగా ప్రకటించింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం కావడం గమనార్హం.

ఏంటి ఈ UPS?

అమెరికాలోని అట్లాంటా కేంద్రంగా పనిచేసే యునైటెడ్ పార్సెల్ సర్వీస్ (UPS) దాదాపు 120 ఏళ్లుగా ఉన్న ఒక దిగ్గజ సంస్థ. షిప్పింగ్, కొరియర్ సేవలు అందిస్తూ, 200కు పైగా దేశాలకు సరుకులను చేరవేస్తుంది. అమెజాన్‌తో కూడా వీరికి డెలివరీ భాగస్వామ్యం ఉంది.

ఎందుకు ఇంతమందిని తీసేశారు?

UPS మూడో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) మంచి లాభాలనే చూపించింది. అయితే, కంపెనీ పెట్టిన పెట్టుబడులకు తగ్గట్టుగా లాభాలు లేకపోవడం, షేరు విలువ పెరగకపోవడం వల్ల ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. దీంతో, లాభాలు రాని విభాగాలను తగ్గించుకుని, మిగిలిన విభాగాల్లో కొన్ని మార్పులు చేసింది. దీనివల్ల 48,000 మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా, అమెజాన్‌తో ఉన్న డెలివరీ భాగస్వామ్యాన్ని కూడా తగ్గించుకుంది.

ఉద్యోగులపై ప్రభావం

2024 ప్రారంభంలో UPS లో 5,00,000 మంది ఉద్యోగులు ఉండేవారు. ఈ ఏడాది మేనేజ్‌మెంట్ టీమ్‌లలో 14,000 మందిని తీసేశారు. ఈ (2025) సంవత్సరంలో డ్రైవర్లు, గోదాములలో పనిచేసే 34,000 మందికి ఉద్యోగాలు పోయాయి. ఈ భారీ తొలగింపులు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

Tags:    

Similar News