Vodafone : వొడాఫోన్ కొత్త ప్లాన్.. ఓటీటీలు ఫ్రీ

Update: 2024-06-17 06:31 GMT

వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ ( Vodafone Idea Limited ) కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. దీనిధర రూ.248. దేశవ్యాప్తంగా అన్ని టెలికం సర్కిళ్ల లో ఇది అందుబాటులో ఉంది. అయితే, ఇది సాధారణ సర్వీస్ వ్యాలిడిటీ ప్లాన్ కాదు. ఇదొక డేటా వోచర్.

దీన్ని రీచార్జ్ చేసుకోవాలంటే కచ్చితంగా యాక్టివ్ సర్వీస్ వ్యాలిడిటీ ప్లాన్ ఉండాల్సిందే. ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే ఓటీటీ ప్రయోజనాలు లభించడం విశేషం. వొడాఫోన్ ఇండియా రూ.248 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. ఇందులో 6జీబీ డేటా కూడా లభిస్తుంది.

వీఐ మూవీస్ అండ్ టీవీ TM (ఎంటీవీ) ప్రో సబ్ స్క్రిప్షన్ కూడా ఉంటుంది. సాధారణంగా వీఐ ఎంటీవీ ప్రో సభ్యత్వం విడిగా తీసుకుంటే నెలకు రూ.202 చెల్లించాలి. ఈ ప్లాన్ తో డిస్నీ ప్లస్ టార్, సోనీలివ్, ఫ్యాన్ డ్, క్లిక్, మనోరమా మ్యాక్స్, చౌపల్, హంగామా సహా పలు ఓటీటీలు లభిస్తాయి. టీవీ సహా మొబైల్ లోనూ కంటెంట్ ను చూడొచ్చు.

Tags:    

Similar News