Expensive Condom : వామ్మో ఒక్క కండోమ్ 44 వేలా? ఆ డబ్బుతో దుబాయ్‌లో లగ్జరీగా ఉండొచ్చు.

Update: 2026-01-01 06:00 GMT

Expensive Condom : ప్రస్తుత కాలంలో కండోమ్ అనేది ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అవాంఛిత గర్భాన్ని నిరోధించడమే కాకుండా, ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కల్పించే ఈ సాధనం మార్కెట్లో కేవలం కొన్ని రూపాయలకే లభిస్తుంది. కానీ ఒకే ఒక్క కండోమ్ ధర వేల రూపాయలు ఉంటే.. ఆ ధరతో ఏకంగా దుబాయ్‌ లాంటి ఖరీదైన నగరంలో విహారయాత్ర చేసి రావొచ్చు. అవును, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఒక పురాతన కండోమ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

200 ఏళ్ల నాటి చారిత్రక వింత: సాధారణంగా కండోమ్ అంటే 'యూజ్ అండ్ త్రో' వస్తువు. కానీ మనం మాట్లాడుకుంటున్న ఈ కండోమ్ ఒక చారిత్రక అద్భుతం. ఇది సుమారు 200 ఏళ్ల క్రితం నాటిది. ఫ్రాన్స్‌లో కనుగొన్న ఈ అరుదైన కండోమ్‌ను ఇటీవల స్పెయిన్‌లో జరిగిన ఒక ఆన్‌లైన్ వేలంలో అమ్మకానికి పెట్టారు. దీనిని దక్కించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేకర్తలు (Collectors) పోటీ పడ్డారు. చివరికి ఆమ్స్టర్‌డామ్‌కు చెందిన ఒక వ్యక్తి దీనిని సుమారు 44,000 భారతీయ రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాడు.

ఈ కండోమ్ ఇంత ఖరీదైనది కావడానికి ప్రధాన కారణం అది దేనితో తయారైందనేది. 18, 19వ శతాబ్దాల్లో ఇప్పుడు మనం వాడుతున్న లాటెక్స్ లేదా రబ్బరు అందుబాటులో ఉండేది కాదు. ఆ సమయంలో జంతువుల అవయవాలను ఉపయోగించి వీటిని తయారు చేసేవారు. ప్రస్తుతం వేలంలో అమ్ముడైన ఈ ప్రత్యేక కండోమ్‌ను గొర్రె పేగులతో తయారు చేశారు. దీని పొడవు సుమారు 19 సెంటీమీటర్లు (7 అంగుళాలు). ఆ కాలంలో గర్భనిరోధక సాధనాల గురించి అవగాహన తక్కువగా ఉన్నా, ఇలాంటి ప్రయోగాలు చేయడం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. దీనిని పూర్తిగా చేత్తో తయారు చేయడం విశేషం.

ఈ కండోమ్ ధరకు దుబాయ్ విహారయాత్రకు మధ్య ఉన్న పోలిక చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన హోటల్స్ దుబాయ్‌లో ఉన్నాయి. అక్కడ అర్మానీ హోటల్ వంటి ఫైవ్ స్టార్ హోటళ్లలో ఒక రాత్రి బస చేయాలంటే సుమారు 38 వేల నుంచి 40 వేల రూపాయలు అవుతుంది. అంటే మీరు కొన్న ఆ ఒక్క పురాతన కండోమ్ ధరకు దుబాయ్ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఒక రాత్రి విలాసవంతంగా గడపవచ్చు. ఒకవేళ మీరు ఇలాంటివి ఐదు కండోమ్‌లు కొంటే, ఆ డబ్బుతో దుబాయ్‌లో ఐదు రోజులు రాజులా బతికేయొచ్చు.

పురాతన చరిత్ర పక్కన పెడితే, నేటి ఆధునిక మార్కెట్లో కూడా కొన్ని అత్యంత ఖరీదైన కండోమ్ బ్రాండ్లు ఉన్నాయి. ప్రస్తుతం SKYN Supreme Feel అనే కండోమ్‌ను ప్రపంచంలోనే ఖరీదైనదిగా భావిస్తారు. దీని పది కండోమ్‌ల ప్యాక్ ధర సుమారు 100 డాలర్లు ఉంటుంది. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 9,000 రూపాయలన్నమాట. సామాన్యులు వాడే కండోమ్‌లకు, ఇలాంటి ప్రీమియం బ్రాండ్లకు మధ్య నాణ్యత, అనుభూతిలో చాలా వ్యత్యాసం ఉంటుందని కంపెనీలు చెబుతుంటాయి.

Tags:    

Similar News