జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (Zee Entertainment Enterprises Limited) షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. సోనీ పిక్చర్స్ లో విలీనం కోసం మళ్లీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు రావడంతో జీ షేర్లు 8.03 శాతం పుంజుకున్నాయి. కంపెనీ అకౌంట్లలో 2000 వేల కోట్ల రూపాయల వరకు అవకతవకలు జరిగినట్లు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గుర్తించినట్లు బుధవారం నాడు బ్లూమ్బర్ ఒక వార్త ప్రచురించింది. దీంతో స్టాక్ మార్కెట్లో జీ షేర్లు 14 శాతం నష్టపోయి 165.65 రూపాయల వద్ద ముగిశాయి. ఓ కేసులో భాగంగా జీ వ్యవస్థాపకులపై విచారణ జరుగుతున్న క్రమంలో కంపెనీ నుంచి 2వేల కోట్లు అక్రమంగా తరలించినట్లు సెబీ గుర్తించిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి.
అయితే కంపెనీ అధికారుల నుంచి సమాచారం అందిన తరువాత ఈ మొత్తంలో మార్పు ఉండే అవకాశం ఉందని సమాచారం. అందు కోసం జీ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర, ఆయన కుమారుడు పునీత్ గోయెంకా, బోర్డు సభ్యులను సెబీ వివరణ కోరినట్లు తెలుస్తోంది. అకౌంట్స్ లో అవకతవకల జరిగినట్లు వచ్చిన వార్తలను జీ ఎంటర్టైన్మెంట్ తోసిపుచ్చింది. ఇవి పూర్తిగా నిరాధారమని, తప్పుడు వార్తలని కొట్టివేసింది. సెబీ కోరిన అన్ని వివరాలను అందించామని, అన్ని రకాలుగా పూర్తి సహకార అందిస్తున్నామని తెలిపింది.
జీ ఖాతాల నుంచి 2వేల కోట్లను ఇతర సంస్థలకు మళ్లించినట్లు ఈ వార్త కథనం తెలిపింది. సుభాష్ చంద్ర, గోయెంకా తమ సొంత ప్రయోజ నాల కోసం కంపెనీ నిధులను దారి మళ్లించాలరన్న ఆరోపణ లు ఎదుర్కొంటున్నారు. దీనిపై సెబీ కొంతకాలంగా దర్యాప్తు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ తో కుదిరిన విలీన ఒప్పందాన్ని కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ (సోనీ పిక్చర్స్) రద్దు చేసుకుంది. డీల్ను ప ఎనరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలను జీ తోసిపుచ్చింది.