RRR : 68వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డు.. ఉత్తమ సినిమా ‘ఆర్ఆర్ఆర్’

Update: 2024-07-12 09:24 GMT

2023 సంవత్సరానికి గానూ 68వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులను తాజాగా ప్రకటించారు. సౌత్‌లోని నాలుగు భాషల్లో 2023తో పాటు 2022లో థియేటర్లలో విడుదలైన చిత్రాల్ని లెక్కలోకి తీసుకుని ఈ అవార్డులను ప్రకటించారు.

2022లో రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’ ఉత్తమ సినిమాగా నిలిచింది. ఆర్ఆర్ఆర్ సినిమా 7 ఫిల్మ్ ఫేర్ అవార్డులతో సత్తా చాటింది.

 క్లాసిక్ ‘ సీతారామం’ సినిమాకు 5 అవార్డులు దక్కాయి. క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ సినిమా అవార్డును సీతారామం దక్కించుకుంది.

 ఉత్తమ నటులుగా రామ్ చరణ్​, జూనియర్ ఎన్టిఆర్ (ఆర్ఆర్ఆర్),

ఉత్తమ నటి మృణాల్ ఠాకూర్(సీతారామం),

ఉత్తమ దర్శకుడు– రాజమౌళి(ఆర్ఆర్ఆర్),

ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్– కీరవాణి(ఆర్ఆర్ఆర్) ,

ఉత్తమ నటి క్రిటిక్స్– సాయిపల్లవి(విరాట పర్వం),

ఉత్తమ సహాయ నటుడు – రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్),

ఉత్తమ సహాయ నటి – నందితా దాస్ (విరాటపర్వం),

ఉత్తమ సాహిత్యం – సిరివెన్నెల సీతారామశాస్త్రి ( సీతారామం) అవార్డులు దక్కించుకున్నారు.

Tags:    

Similar News