Prabhakaran : గ్రాండ్ గా సట్టముం నీతియుం వెబ్ సిరీస్ సక్సెస్ మీట్

Update: 2025-08-05 14:22 GMT

శరవణన్ ప్రధాన పాత్రలో నటించిన ‘సట్టముం నీతియుం’ సిరీస్‌ను జీ5 తెలుగు ప్రేక్షకులకు అందించింది. 18 క్రియేటర్స్ బ్యానర్ మీద ఈ సిరీస్‌ను శశికళ ప్రభాకరణ్ నిర్మించారు. షో రన్నర్‌‌గా సూర్య ప్రతాప్. ఎస్ వ్యవహరించారు. బాలాజీ సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ తెలుగులో రీసెంట్‌గా స్ట్రీమింగ్ అయి మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ‘సట్టముమ్ నీతియుమ్’ సక్సెస్ మీట్‌ను మంగళవారం ఘనంగా నిర్వహించారు.

శశికళ మాట్లాడుతూ .. ‘నిర్మాతగా ఇలా స్టేజ్ మీద మాట్లాడుతుండటం కొత్తగా ఉంది. యాంకర్‌గా ఎన్నో సార్లు మైక్ పట్టుకున్నా కూడా ఈ రోజు ఇలా కొత్తగా అనిపిస్తోంది. ఇదంతా కూడా నా భర్త ప్రభాకరణ్ వల్లే సాధ్యమైంది. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్‌ను ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన అందరికీ థాంక్స్. తెలుగులోనూ ఈ సిరీస్ అద్భుతంగా దూసుకుపోతోంది. ఈ సిరీస్‌కు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. బాలాజీ గారు ఈ సిరీస్‌ను కేవలం 13 రోజుల్లోనే పూర్తి చేశారు. ఆయన వల్లే ఈ సిరీస్ ఇంత అద్భుతంగా వచ్చింది. ఆర్ట్ డైరెక్టర్ భావన మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. శరవణన్ సర్ ఈ సిరీస్‌కు బ్యాక్ బోన్‌‌లా నిల్చున్నారు. నమ్రత ప్రస్తుతం చాలా బిజీగా మారిపోయారు. ఈ సిరీస్‌‌లో అందరూ అద్భుతంగా నటించారు. నా భర్త ప్రభాకరణ్‌కు సిరీస్‌లు, సినిమాల పట్ల ఎంతో ప్యాషన్ ఉంటుంది. ఆయనకు ఈ ప్రాజెక్ట్ చాలా ప్రత్యేకం. ఈ సిరీస్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

బాలాజీ సెల్వరాజ్ మాట్లాడుతూ .. ‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నా నిర్మాతలు, జీ5 టీంకు థాంక్స్. నా ఫస్ట్ హీరో శరవణన్ సర్. ఈ సిరీస్‌లో పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అందరూ ఈ సిరీస్‌ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

జీ5 సౌత్ బిజినెస్, మార్కెటింగ్ హెడ్ లాయిడ్ జేవియర్ మాట్లాడుతూ .. ‘మమ్మల్ని మీడియా ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. సట్టముం నీతియుం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. పది రోజుల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటేసింది. 13 రోజుల్లోనే ఇంత మంచి సిరీస్‌ను తెరకెక్కించడం మామూలు విషయం కాదు. పబ్లిక్ డిమాండ్ వల్లే ఈ సిరీస్‌ను ఇతర భాషల్లోకి డబ్ చేశాం. ప్రస్తుతం తెలుగులోనూ ఈ సిరీస్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సిరీస్‌ను సక్సెస్ చేసిన ఆడియెన్స్‌‌కి థాంక్స్’ అని అన్నారు.

నటుడు శరవణన్ మాట్లాడుతూ .. ‘తమిళంలో ఈ ‘సట్టముం నీతియుం’ సిరీస్ బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులోనూ అంతే రెస్పాన్స్ వస్తోంది. ఈ సిరీస్‌ను సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

ప్రభాకరణ్ మాట్లాడుతూ ..‘‘సట్టముం నీతియుం’ సిరీస్‌ను ఆడియెన్స్ బ్లాక్ బస్టర్ చేశారు. మమ్మల్ని నమ్మిన జీ5 టీంకు థాంక్స్. బాలాజీ సెల్వరాజ్ ఈ సిరీస్‌ను అతి తక్కువ రోజుల్లో పూర్తి చేశారు. ఏజీఆర్ సర్‌కి ఫస్ట్ ప్రివ్యూ వేసి చూపించాం. అందరూ సిరీస్‌ను ఆదరిస్తున్నారు. తెలుగులో మా సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సిరీస్‌ను సక్సెస్ చేసిన అందరికీ థాంక్స్’ అని అన్నారు.

 

Tags:    

Similar News