Balakrishna Akhanda 2 : అఖండ 2 నుంచి అదిరిపోయే అప్డేట్

Update: 2024-12-11 12:12 GMT

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తోన్న అఖండ 2 పై భారీ అంచనాలున్నాయి. బాలయ్యతో సినిమా అంటే బోయపాటికి స్పెషల్ గా పూనకాలు వస్తాయి. వాటిని థియేటర్స్ లోనూ రప్పిస్తుంటాడు. వీరికి అఖండతో థమన్ తోడయ్యాడు. ఆ టైమ్ లో ఈ మూవీ చేసిన బాక్సాఫీస్ తాండవానికి ఓవర్శీస్ కూడా ఊగిపోయింది. అందుకే ఈ సారి అఖండ 2 తాండవం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రగ్యా జైశ్వాల్ మరోసారి రిపీట్ అవుతోన్న ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందంటూ అప్డేట్ ఇచ్చారు.

మామూలుగా షూటింగ్ బిగిన్స్ అని చెప్పడానికి అప్డేట్ ఇస్తున్నాం అని ఊరించరు కదా.. కానీ వీళ్లు ఒక రోజు ముందు నుంచి ఇవాళ( బుధవారం) అఖండ నుంచి అద్భుతమైన అప్డేట్ రాబోతోందంటూ ఊరించారు. ఊహించినట్టుగానే ఇది కేవలం షూటింగ్ అప్డేట్ కాదు.. ఏకంగా రిలీజ్ డేట్ నే అనౌన్స్ చేశారు. దసరా సందర్భంగా హాలీడేస్ ను ఓ రేంజ్ లో క్యాష్ చేసుకునేలా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25నే విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. సో.. ఈ సారి దసరాకు బాలయ్య బాబు తాండవానికి థియేటర్స్ ప్యాన్ ఇండియా రేంజ్ లో దద్దరిల్లిపోతాయన్నమాట. 

Full View

Tags:    

Similar News