Tollywood : మహేశ్ తో సినిమా.. జక్కన్న స్ట్రాటజీ ఏంటి

Update: 2025-04-25 09:30 GMT

ఇతిహాసం, యాక్షన్ ఫాంటసీ చిత్రాలతో కాలకేయ పాత్ర ఇచ్చాడు. దీంతో ప్రభాకర్కు తనకంటూ ప్రత్యేకత సంతరించుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. అయితే తాను తెరకెక్కించే సినిమాల విషయంలో చివరి వరకు గోప్యత చే పాటించడం జక్కన్నకు అలవాటు. అంతే కాదు ప్రతి సినిమాలో ఒక ప్రత్యేక పాత్రను పరిచయం చేసి ప్రేక్షకుల మనసును కొల్లగొడతాడు. ఈగ సినిమాతో మొదలైన ఆయన ప్రత్యేక స్ట్రాటజీ ఆ తర్వాత బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల్లోనూ కొనసాగింది. ఈగతో సినిమా తీసి ప్రేక్షకులను మెప్పించాడు. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన అజయ్ కి విక్రమార్కుడు సినిమాలో విలన్ పాత్ర ఇచ్చి మెప్పించాడు. అంతే కాదు చిన్న పాత్రలకే పరిమితమైన ప్రభాకర్కు బాహుబలి సినిమాలో మంచి హైప్ వచ్చింది. ఇద్దరు అగ్ర హీరోలతో ఆర్ఆర్ఆర్ సినిమా తీసిన జక్కన్న అందులో విలన్ పాత్రల కోసం తెల్లవారిని ఎంచుకున్నా డు. తాజాగా ప్రిన్స్ మహేశ్ బాబుతో ఆయన తెరకెక్కిస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 సెట్స్ పైన ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. మూడో షెడ్యూల్కు రంగం సిద్దమవుతున్న వేళ... అందులో విలన్ పాత్ర ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. మహేశ్ ను బలంగా ఢీకొట్టే వ్యక్తి విలన్ గా ఉండాలని భావిస్తున్న జక్కన్న హాలీవుడ్లో నటించిన ఓ నల్ల జాతీయుడిని ఇందుకోసం ఎంపిక చేసినట్లు సమాచారం.

Tags:    

Similar News