‘గజిని’ సినిమాలో నటించడం తన జీవితంలోనే ఒక చెత్త నిర్ణయమని స్టార్ హీరోయిన్ నయనతార ( Nayanthara ) అన్నారు. ‘‘గజిని’ సినిమాలో ముందు అనుకున్న విధంగా నా పాత్రను తెరకెక్కించలేదు. ఈ విషయంలో నేను ఎవరినీ తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటినే గుణపాఠంగా స్వీకరిస్తా’ అని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ విషయంపై మురుగదాస్ మాట్లాడుతూ.. ‘సినిమా కోసం ఎవరి పాత్రను ప్రత్యేకంగా రాయలేదు. ఒక్కోసారి పెద్ద హీరోయిన్లకు కూడా నిడివి తక్కువ ఉన్న పాత్రలు రాయాల్సి వస్తుంది. అది మన చేతుల్లో లేదు’ అని సమాధానమిచ్చారు. సూర్య హీరోగా తెరకెక్కిన ఇదే చిత్రాన్ని మురుగదాస్ హిందీలో ఆమిర్ ఖాన్‌తో రూపొందించారు.
2008లో విడుదలై అక్కడ కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. నయనతార నటించిన పాత్రను హిందీలో జియా ఖాన్ పోషించారు. నయనతార పారితోషికం 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది.వయస్సు పెరుగుతున్నా నయనతారకు మూవీ ఆఫర్లు వస్తున్నాయి. పెళ్లైనా నయనతార జోరు కొనసాగుతుండటం గమనార్హం.