Nora Fatehi : మనీలాండరింగ్ కేసులో ఈడీ ముందు హాజరైన నటి..
Nora Fatehi : మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేహీ... ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు.;
Nora Fatehi : మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేహీ... ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. ఈడీ సమన్లు అందుకున్న మరో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శుక్రవారం హాజరయ్యే అవకాశం ఉంది.
ఈడీ ముందు మొదటిసారి హాజరైన నోరా ఫతేహీని... అధికారులు విచారించారు. మోసం కేసులో అరెస్టయిన సుకేష్ చంద్రశేఖర్‌తో సంబంధాలపై ఆరా తీశారు. 200 కోట్ల హవాలా కేసు విషయంలో పలు ప్రశ్నలు సంధించారు.
ఇదే కేసులో బాలీవుడ్ సెలబ్రిటీలను ఈడీ విచారిస్తోంది. బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీకి ఇప్పటివరకు ఈడీ రెండుసార్లు సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.
కాగా, ఈడీ నోటీసు అందుకున్న నోరా ఫతేహీ ఈడీ ముందు హాజరయ్యారు శుక్రవారం జాక్వెలిన్‌ను ఈడీ విచారించనుంది. కాగా, ఇప్పటికే ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను ఈడీ ఒకసారి విచారించింది. సుకేష్ చంద్రశేఖర్ తో బాలీవుడ్ హీరోయిన్లకు గల సన్నిహిత సంబంధాలపై మాత్రమే విచారణ జరుపుతున్నామని, మనీలాండరింగ్ కేసులో వీరిద్దరు అనుమానితులు కాదని ఈడీ అధికారులు స్పష్టం చేశారు
రెండు వందల కోట్ల హవాలా కేసు విషయంలో సుకేష్ చంద్రశేఖర్‌ను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. కొన్ని రోజుల కింద సుకేష్‌కు చెందిన చెన్నైలోని బీచ్ బంగ్లాలో 2 కిలోల బంగారం, 85 లక్షల నగదుతోపాటు పలు లగ్జరీ కార్లు దొరికాయి.
సుకేష్‌తో నోరా ఫతేహీ, జాక్వాలిన్ ఫ్నెర్నాండెజ్ లకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈడీ దృష్టికి వచ్చింది. మొదట్లో ఇద్దరినీ అనుమానితులుగానే పరిగణించినా, వారు కూడా బాధితులేనని విచారణలో తేలింది. సుకేష్ తన భార్య లీనా పాల్ ద్వారా బాలీవుడ్ హీరోయిన్లను మోసం చేశాడని విచారణలో కనుగొన్నారు.