Vijay Antony: షూటింగ్‌లో ప్రమాదం.. 'బిచ్చగాడు' ఫేమ్ విజయ్ ఆంటోనీ ఆస్పత్రిలో..
Vijay Antony: తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు అయిన విజయ్ ఆంటోని తన రాబోయే చిత్రం పిచైక్కారన్ 2 సెట్స్‌లో ప్రమాదానికి గురయ్యాడు.
Vijay Antony: తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు అయిన విజయ్ ఆంటోని తన రాబోయే చిత్రం పిచైక్కారన్ 2 సెట్స్‌లో ప్రమాదానికి గురయ్యాడు. షూటింగ్‌లో భాగంగా మలేషియాలో యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు అతను ప్రమాదానికి గురయ్యాడు. చిత్ర యూనిట్ హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తోంది. .
విజయ్ హెల్త్ అప్‌డేట్‌ను పంచుకోవడానికి నిర్మాత ధనంజయన్ ట్విట్టర్‌లోకి వెళ్లారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విజయ్ ప్రమాద గాయం నుండి త్వరగా కోలుకుంటున్నారని పంచుకోవడం ఆనందంగా ఉంది. అతను లంకావిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని కుటుంబం అతనితో ఉంది. త్వరలో ఆయనను చెన్నై ఆస్పత్రికి షిప్ట్ చేస్తారు. అతను త్వరగా కోలుకోవాలని, తిరిగి షూటింగ్‌లో పాల్గొనాలని ప్రార్థిద్దాం. "అని ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.
దర్శకుడు CS అముధన్ కూడా ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.. "నేను వైద్యులతో మాట్లాడుతున్నాను.. విజయ్ కుటుంబసభ్యులను అతడి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నాను.. విజయ్ క్షేమంగా ఉన్నాడని తెలిపారు. అతను షూటింగ్ స్పాట్‌లోకి త్వరలో తిరిగి వస్తాడు! కమ్ బ్యాక్ స్ట్రాంగ్ నన్బా.. ఈ సంవత్సరం మాది!" అని రాసుకొచ్చారు.
పిచైక్కారన్ 2 అదే పేరుతో వచ్చిన సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్. మొదటి భాగానికి శశి దర్శకత్వం వహించగా, విజయ్ ఆంటోని రెండవ అధ్యాయానికి దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ స్వయంగా ఈ చిత్రానికి సంభాషణలు కూడా రాశాడు. దర్శకుడిగానూ పరిచయం అవుతున్నాడు.
అతను తన నిర్మాణ సంస్థ అయిన విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ ద్వారా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాడు. పిచైక్కారన్ 2లో జాన్ విజయ్, హరీష్ పేరడ్డి, వై.జి.మహేంద్ర, అజయ్ ఘోష్, యోగి బాబు తదితరులు నటిస్తున్నారు. వేసవిలో సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Happy to share that @vijayantony is fast recovering from the accident injury. He is under observation at the hospital at #Langkawi & his family has reached and with him. They will take a call to bring him to Chennai soon.
— Dr. Dhananjayan BOFTA (@Dhananjayang) January 17, 2023
Let's pray for his speedy recovery & back in action 🙏
Guys I've spoken to his nearest circle & @vijayantony is well, he will be back soon with shooting & his many cryptic tweets! Come back strong nanba..this year is ours!
— CS Amudhan (@csamudhan) January 16, 2023