Priyamani : విడాకుల పై క్లారిటీ ఇచ్చేసింది..!
Priyamani : సినీ నటి ప్రియమణి ఆమె భర్త ముస్తాఫా రాజ్ నుంచి విడిపోబోతున్నారంటూ గతకొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే..;
Priyamani : సినీ నటి ప్రియమణి ఆమె భర్త ముస్తాఫా రాజ్ నుంచి విడిపోబోతున్నారంటూ గతకొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.. గతంలో తన భర్త నుంచి తాను విడాకులు తీసుకోలేదని ముస్తాఫా మొదటి భార్య అయేషా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రియమణితో అతని వివాహం చెల్లదంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. \
ఈ వ్యవహారంతో ప్రియమణి, ముస్తాఫా రాజ్ మధ్య విబేధాలు వచ్చాయని, ఇద్దరు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్స్ కి ఓ ఫోటోతో చెక్ పెట్టింది ప్రియమణి.. దీపావళి సందర్భంగా భర్త ముస్తాఫా రాజ్‌తో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో తన భర్తతో కలిసి ఎంతో సంతోషంగా ఉన్నట్టుగా ప్రియమణి కనిపిస్తోంది.
దీంతో విడాకుల రూమర్స్‌పై ప్రియమణి పరోక్షంగా బదులిచ్చినట్లయ్యిందని నెటిజన్లు అనుకుంటున్నారు.